Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కూల్‌కు వెళ్తున్నానని బయటికెళ్లిన Teacher అదృశ్యం..

హైదరాబాద్ సిటీ/నిజాంపేట్‌ : స్కూల్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికెళ్లిన ఓ ఉపాధ్యాయురాలు అదృశ్యమైంది. ప్రగతినగర్‌లోని భారత్‌ పెట్రోలియం ఎదురుగా నివాసముండే బమిటిపాటి సూర్యకుమారి(56) ధ్యానషిత స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. మూడు రోజులుగా అనార్యోంగా ఉండటంతో ఇంటి వద్దనే ఉంది. ఈ నెల 6న ఆరోగ్యం కుదుటపడటంతో స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రోజూ సాయంత్రం 4 గంటలకే ఇంటికొచ్చే సూర్యకుమారి 5 గంటలైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్కూల్‌కు వెళ్లి విచారించగా.. స్కూల్‌కు రాలేదని చెప్పారు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో.. కుమారుడు ప్రదీప్‌ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement
Advertisement