సమస్యలు పరిష్కారించాలని టీచర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-07-30T03:26:43+05:30 IST

: పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట

సమస్యలు పరిష్కారించాలని టీచర్ల ధర్నా
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న టీచర్లు

నాయుడుపేట, జూలై 29 : పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో  విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు.  ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని, పీఆర్‌సీ నివేదికను వెల్లడించి 01-07-2018 నుంచి అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాసులు, తిరుపాల్‌, విజయసాయి, హరి, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T03:26:43+05:30 IST