Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీచర్ల డిప్యుటేషన్లు రద్దు

పాత స్థానాలు, సర్దుబాటుకు కమిషనర్‌ ఆదేశం

టీచర్ల గొడవతో నిలిచిన జాబితా తయారీ

అనంతపురం కార్పొరేషన, నవంబరు 30: ఎట్టకేలకు నగరపాలక సంస్థ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు రద్దు చేసి యథాస్థానాలకు, అ వసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయాలని నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి ఆదేశించారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్ర చురితమైన ‘ధిక్కారమేనా?’ కథనానికి నగర కమిషనర్‌ స్పందించి ఈ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే మూడేళ్ల క్రితం అమలు చేసిన డిప్యుటేషనను రద్దు చేయాలని సెక్రటరీ సంగం శ్రీనివాసులు, యూఎల్‌బీ కో-ఆర్డినేటర్‌ రమే్‌షలకు సూచించారు. సెక్రటరీ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి తన చాంబర్‌ లో సర్దుబాటుకు సంబంధించి జాబితా త యారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలోనే సమాచారం అందుకున్న ఉ పాధ్యాయులు, సంఘాల నాయకులు ఒక్కొక్కరు ఆయన చాంబర్‌కు రావడం మొదలుపెట్టారు. జాబితా తయారు చేసే సమయం లో ఓ ఉపాధ్యాయుడిని ఎలా పెట్టుకున్నారని పలువురు నిలదీశారు. దీనికితోడు సం ఘాల నాయకులు, పలువురు ఉపాధ్యాయు లు సర్దుబాటుపై గొడవకు దిగారు. దీంతో కో-ఆర్డినేటర్‌ రమేష్‌ అసంతృప్తి వ్యక్తం చే స్తూ బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం సెక్రటరీ శ్రీనివాసులు సంఘం నాయకులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అందరూ ఒక నిర్ణయానికి రావాలనీ, నిబంధనల మేరకు బుధవారం జాబితా సిద్ధం చే స్తామని స్పష్టం చేశారు.


Advertisement
Advertisement