అధ్యాపకులను నియమించాలని ఆందోళన

ABN , First Publish Date - 2021-11-30T05:45:32+05:30 IST

వీఆర్‌ పురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు చదువులు అంధకారంలో ఉన్నాయి. సోమవారం ఈ కళాశాలను వీఆర్‌ పురం జడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అధ్యాపకులను నియమించాలని ఆందోళన

వరరామచంద్రాపురం, నవంబరు 29: వీఆర్‌ పురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు చదువులు అంధకారంలో ఉన్నాయి. సోమవారం ఈ కళాశాలను వీఆర్‌ పురం జడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో అధ్యాపకులు లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలని ప్రశ్నించారు. అనంతరం ఆయన ఆర్జేడీతో మాట్లాడి ఇక్కడి పరిస్థితిని వివరించి ఖాళీగా ఉన్న 8 అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఇందిరా సెంటర్లో నిరసన తెలిపారు. అధ్యాపకులను తక్షణం నియ మించాలని విద్యార్థులు  నినాదాలు చేశారు. టీడీపీ మండల నాయకుడు ముత్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:45:32+05:30 IST