టీచర్లను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యక్ష పోరాటం

ABN , First Publish Date - 2021-07-30T05:59:14+05:30 IST

టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికీ నెరవేర్చాలనీ, నిర్లక్ష్యంంగా వ్యవహరిస్తే... ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు ఇతర నాయకులు హెచ్చరించారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో అనంత నగరంతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు.

టీచర్లను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యక్ష పోరాటం

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు 

అనంతపురం విద్య, జూలై 29: టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికీ నెరవేర్చాలనీ, నిర్లక్ష్యంంగా వ్యవహరిస్తే... ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు ఇతర నాయకులు హెచ్చరించారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో అనంత నగరంతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. ఉపాధ్యాయుల నుంచి భారీ స్పందన వచ్చింది. అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. అనేక సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. పీఆర్సీ అమలు చేయాలనీ, డీఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలనీ, సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ వర్తింపజేయాలని కోరామన్నారు. నూతన జాతీయ విద్యావిధానం అమలుపై స్పష్టత ఇవ్వడంతోపాటు 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనీం చేయకూడదనీ, నెలవారీ ఉద్యోగోన్నతులు చేపట్టాలని కోరామన్నారు. టీచర్ల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం పునరావృతం చేస్తే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రభాకర్‌, సీపీఎస్‌ జిల్లా నాయకుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లు పూర్తయినా రద్దుచేయలేదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులను తీవ్ర మానసిక ఆందోళనకు లోనుచేస్తోందన్నారు.  పెన్షనర్ల సంఘం పెద్దన్నగౌడ్‌, రెవెన్యూ ఉ ద్యోగుల సంఘం జయరామప్ప ధర్నాకు మద్దతు పలికారు. కార్యక్రమం లో నేతలు సిరాజుద్దీన్‌, గాయత్రి, రామకృష్ణ, సర్ధార్‌ వలి, సూర్యనారాయ ణ, రమణ, తిప్పేస్వామి, ఇతర సంఘాల నాయకులు బాబు, జార్జ్‌, ఉ మామహేశ్వర్‌, రాజశేఖర్‌, నాగభూషణం, చంద్రమోహన్‌ పాల్గొన్నారు.


నియోజకవర్గ కేంద్రాల్లో..

అనంత నగరంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఽధర్మవరంలో ఆ సంఘం నాయకులు కోనంకి అశోక్‌కుమార్‌, ముత్యాలప్ప, చంద్రశేఖర్‌ గౌడ్‌, పెనుకొండలో కొడూరు శ్రీనివాసులు, రఘునాథరావు, రాయదుర్గంలో మోహన్‌రెడ్డి, రామాంజనేయులు, పుట్టపర్తిలో అశోక్‌కుమార్‌, చంద్ర,శరి, మడకశిరలో లతా రామకృష్ణ, గవ్వల రా మకృష్ణ, ఉరవకొండలో హనుమప్ప, ధనుంజయ, కళ్యాణదుర్గంలో బొమ్మ య్య, వెంకటేశులు, కదిరిలో త్రిమూర్తి,  నారాయణ, ఆదిబయన్న, తాడిపత్రిలో రామిరెడ్డి, డేనియల్‌, శ్రీవాత్సవరెడ్డి, గుత్తిలో మధుఆబు, దేశాయ్‌ నాగరాజు, శ్యామ్‌ రవిబాబు, హిందూపురంలో రవిశేఖర్‌, అంజనమూర్తి, రాందాసునాయక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T05:59:14+05:30 IST