రివర్స్‌ పీఆర్సీ చరిత్రలో నిలిచిపోతుంది

ABN , First Publish Date - 2022-01-18T05:27:00+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో రివర్స్‌ పీఆర్సీ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు.

రివర్స్‌ పీఆర్సీ చరిత్రలో నిలిచిపోతుంది
విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సాబ్జీ

ఆకివీడు, జనవరి 17: వైసీపీ ప్రభుత్వంలో రివర్స్‌ పీఆర్సీ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జగన్‌ ఎ న్నికలకు ముందు ఐఆర్‌ 27 శాతం ప్రకటిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 23 శాతాన్ని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఫిట్‌మెంట్‌ ప్రకటించే ముందు సంఘాల అ భిప్రాయం కూడా తెలుసుకోలేదన్నారు. ఈ పీఆర్సీ వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతనాల్లో 4 శాతం నష్టపోతారన్నారు. 2019లో 5 డీఏలు ఇవ్వకపోవడంతో ఒక్కో ఉపాధ్యాయుడు రూ.3లక్షల వరకు నష్టపోయారన్నారు. సచివాలయ ఉద్యోగులు నిబంధనలు మేర స్కేలు అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యలన్నీ శాసనమండలి బడ్జెట్‌ సమావేశంలో చర్చకు తెస్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నేతలు డీఎన్‌వీడీ ప్రసాద్‌, టి.వెంకటేశ్వరరావు, పెంకి విజయ్‌కుమార్‌, శేషుబాబు, కె.ప్రసాద్‌, రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-18T05:27:00+05:30 IST