Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెర్జింగ్‌ స్కూళ్లకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి

కడప(ఎడ్యుకేషన్‌), డి సెంబరు 4: నూతన విద్యావిధానంలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో విలీనమైన 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం మెర్జింగ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. నగరంలోని సీఎ్‌సఐ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన విద్యావిధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు రకాల పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ఎక్కడా విద్యార్థికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో కడప ఉపవిద్యాధికారి నాగేశ్వర్‌రావు, కడప మండల విద్యాధికారి నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎ్‌సఐ పాఠశాలలో మఽధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం మెనూ ప్రకారం నాణ్యతతో ఉండాలని ఆదేశించారు.

Advertisement
Advertisement