సీనియార్టీ జాబితాలపై అప్పీళ్లకు నేటితో గడువు ముగింపు

ABN , First Publish Date - 2020-12-04T05:59:52+05:30 IST

టీచర్ల బదిలీలపై జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ శుక్రవారంతో ముగియ నుంది.

సీనియార్టీ జాబితాలపై అప్పీళ్లకు నేటితో గడువు ముగింపు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 3 : టీచర్ల బదిలీలపై జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ శుక్రవారంతో ముగియ నుంది. వీటిని ఈ నెల ఏడో తేదీలోగా పరిష్కరించి జాయిం ట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) అనుమతితో 8న తుది జాబితాలను ప్రకటించనున్నారు. సబ్జెక్టుల వారీగా వేకెన్సీల జాబితాలు గు రువారం విడుదల చేశారు. తప్పనిసరి బదిలీ కింద గుర్తిం చిన 1,807 స్థానాలకు అదనంగా స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 10 శాతం, ఎస్‌జీటీ కేడర్‌లో ఐదు శాతం స్థానాలను అద నంగా చేర్చి వేకెన్సీ జాబితాలను విడుదల చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 

కాంట్రాక్టు ఏజెన్సీకి చిక్కీల పంపిణీ బాధ్యతలు 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పంపిణీ చేస్తున్న చిక్కీల సరఫరా కాంట్రాక్టును వైజాగ్‌కు చెందిన ఎన్‌సీఎంఎఫ్‌ (నేషనల్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌)కు అప్పగించారు. 

Updated Date - 2020-12-04T05:59:52+05:30 IST