సమస్యలపై ఉద్యమించిన ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2021-07-30T06:26:39+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బీకేముత్యాలప్ప డిమాండ్‌ చేశారు.

సమస్యలపై ఉద్యమించిన ఉపాధ్యాయులు
ధర్నాలో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బీకేముత్యాలప్ప

ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ధర్మవరం, జూలై 29: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బీకేముత్యాలప్ప డిమాండ్‌ చేశారు.ఈ మేరకు ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీకేముత్యాలప్ప మా ట్లాడుతూ....విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. దశాబ్దాలుగా సమస్యలు పరిష్కా రానికి నోచుకోని కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర మాన సిక ఆందోళనలో మునిగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినా సమస్యలను పరిష్కరించలేకపోయిందన్నారు. సీపీఎస్‌ రద్దుచేసి పాతపెన్సన విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్‌సీ నివే దికను వెల్లడించి 01-07-2018 నుండి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు, డీఏల బకాయి లను వెంటనే చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయా లని, ఉపాధ్యాయులను నాడు-నేడు వంటి బోధనేతర పనులనుండి తప్పించాలని, గత వేసవిలో నాడు-నేడులో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు సంపాదిత సెలవు మంజూరు చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవ ర్గానికి ఒక డివైఈఓ పోస్టు మంజూరు చేయాలని, కరోనాతో మృతిచెందిన ఉద్యోగ కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, మున్సిపల్‌ ఉపాధ్యా యులకు పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశా లలకు తరలించరాదని తదితర డిమాండ్లను ప్రభుత్వం స్పందించి పరిష్కరిం చాలని డిమాండ్‌ చేశా రు. అనంతరం తహసీల్దార్‌ నీలకంఠారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల ర్‌ నాగేశ్వరి, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు బలరాముడు, ధర్మవరం జోన నాయకులు చంద్రశేఖ ర్‌గౌడ్‌,  శ్రీనివాస్‌, ఏపీటీఎఫ్‌ పట్టణశాఖ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు శంకరనారాయణ, వాసుకుమార్‌, గోపాల్‌నా యక్‌, కృష్ణమూర్తి, రామ లింగారెడ్డి, నాగభూషణం, ఆంజ నేయులు, దుర్గాప్రసాద్‌, నాగేంద్ర, బయన్న, వెంక టేశ, మహమ్మద్‌రఫీ, శివానంద తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T06:26:39+05:30 IST