నకిలీ డిగ్రీలతో టీచర్ ఉద్యోగాలు.. వేటేసిన ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-03-03T10:23:30+05:30 IST

నకిలీ డిగ్రీ పత్రాలు సమర్పించి టీచర్లుగా చలామణి అవుతున్న వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నకిలీ బీఈడీ డిగ్రీలతో ఉద్యోగాలు సంపాదించిన 812 మంది టీచర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

నకిలీ డిగ్రీలతో టీచర్ ఉద్యోగాలు.. వేటేసిన ప్రభుత్వం!

లక్నో: నకిలీ డిగ్రీ పత్రాలు సమర్పించి టీచర్లుగా చలామణి అవుతున్న వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నకిలీ బీఈడీ డిగ్రీలతో ఉద్యోగాలు సంపాదించిన 812 మంది టీచర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. అలహాబాద్ కోర్టులో ఈ టీచర్ల సర్టిఫికెట్లు నకిలీవని తేలాయి. ఈ విషయం స్పష్టం అవడంతో కోర్టు.. వెంటనే ఈ టీచర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయాన్ని బేసిక్ శిక్షా పరిషత్ కార్యదర్శి పీఎస్ బాఘేల్ వెల్లడించారు.

Updated Date - 2021-03-03T10:23:30+05:30 IST