Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నంత పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ !

సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తనపై నిరవధిక నిషేధం విధించిన ఫేస్‌బుక్, ట్విటర్‌కు పోటీగా 'GETTR' పేరిట కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చారు. టీమ్ డొనాల్డ్ ట్రంప్ గురువారం 'GETTR'ను ఘనంగా లాంచ్ చేసింది. ఈ విషయాన్ని 'POLITICO' ట్విటర్ ద్వారా తెలియజేసింది. దీంతో ట్రంప్ అభిమానులు, రిపబ్లికన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాదిరిగా కాకుండా భావ ప్రకటనకు 'GETTR'లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వారు పేర్కొంటున్నారు. 

ఇదిలాఉంటే.. 2020 ఎన్నికల్లో ఓటమిని భరించలేని ట్రంప్.. జనవరి 6న తన అనుచరులతో క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారు. ఈ హింసాకాండ అనంతరం ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై సామాజిక మాధ్యమాలు ​ఒక్కొక్కటి బ్యాన్ వేశాయి. మొదట ట్విటర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. హింసను ట్రంప్​ మరింత ప్రేరేపించే అవకాశమున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేసింది. కాగా, ట్రంప్ ట్విటర్ ఖాతా శాశ్వత నిషేధానికి గురైన సమయంలో ఆయన​కు 88.7 మిలియన్​ ఫాలొవర్స్​ ఉన్నారు. అధ్యక్షుడు 51మందిని ఫాలో అయ్యారు. అలాగే ఫేస్‌బుక్ సైతం ట్రంప్ ఖాతాపై నివరధిక వేటు వేసింది. అటు ఇన్‌స్టాగ్రాంతో పాటు ఇతర మరికొన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా ట్రంప్ ఖతాలపై నిషేధం విధించాయి. దీంతో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అన్నట్టుగానే గురువారం 'GETTR' పేరిట కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చారు. 


Advertisement
Advertisement