Advertisement
Advertisement
Abn logo
Advertisement

సకుటుంబ సమేతంగా..

  • టీమిండియా ఇంగ్లండ్‌కు పయనం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో సాగే సుదీర్ఘ పర్యటనలో భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు. ఈ మేరకు బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి బ్రిటన్‌ సానుకూలంగా స్పందించింది. మహిళల క్రికెటర్లు, సహాయక సిబ్బంది కూడా తమ ఆప్తులను తీసుకెళ్లవచ్చు. ఇప్పటికే ముంబైలో కఠిన క్వారంటైన్‌లో ఉన్న వీరంతా నేడు ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. మరోవైపు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు వెళ్లడం లేదు. అక్కడి క్వారంటైన్‌ నిబంధనలే దీనికి కారణం. ‘డబ్ల్యుటీసీ ఫైనల్‌కు గంగూలీ, జై షా వెళ్లడం లేదు. వాస్తవంగా పాలకులు మ్యాచ్‌లకు ముందే అక్కడికి వెళతారు. కానీ క్రికెటేతర్లకు 10 రోజుల క్వారంటైన్‌ ఉండడంతో వెళ్లలేకపోతున్నారు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. 


Advertisement
Advertisement