పోరాడి ఓడిన భారత్‌

ABN , First Publish Date - 2021-07-29T09:32:35+05:30 IST

ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్‌ 4 వికెట్ల తేడాతో లంక చేతిలో పోరాడి ఓడింది...

పోరాడి ఓడిన భారత్‌

  • రెండో టీ20లో లంక గెలుపు
  • నేడే మూడో టీ20
  • రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

కొలంబో: ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్‌ 4 వికెట్ల తేడాతో లంక చేతిలో పోరాడి ఓడింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌స 1-1తో సమమైంది. బలహీనమైన బ్యాటింగ్‌ లైన్‌పతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 132/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (40), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (29) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఆకట్టుకోలేకపోయారు. అకిల ధనంజయ (2/29) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో లంక 19.4 ఓవర్లలో 133/6 పరుగులు చేసి గెలిచింది. మినోద్‌ భనుక (36) ధాటిగా ఆడగా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ధనంజయ డిసిల్వ (34 బంతుల్లో 40 నాటౌట్‌) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. కుల్దీప్‌ (2/30) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. క్రునాల్‌ పాండ్యాకు కరోనా సోకడంతో.. అతడితో సన్నిహితంగా మెలిగిన 8 మంది ప్రధాన ఆటగాళ్లను ఐసోలేషన్‌కు పంపడంతో టీమిండియా బలహీనపడింది. 5 గురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌, ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. అయితే, నవ్‌దీప్‌ సైనీ ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. ఐపీఎల్‌ స్టార్లు పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నితీష్‌ రాణా, చేతన్‌ సకారియా టీ20ల్లో అరంగేట్రం చేశారు. 


మెరుపుల్లేవ్‌.: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను లంక స్పిన్నర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఓపెనర్లు గైక్వాడ్‌ (21), ధవన్‌ నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, ఏడో ఓవర్‌లో రుతురాజ్‌ను షనక అవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధవన్‌, పడిక్కల్‌ కొంత వేగంగా ఆడడంతో.. 10 ఓవర్లు ముగిసే భారత్‌ 61/1తో నిలిచింది. డిసిల్వ బౌలింగ్‌లో పడిక్కల్‌ సిక్స్‌తో ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు గేర్‌ మార్చే ప్రయత్నం చేస్తున్న ధవన్‌ను అకిల బౌల్డ్‌ చేశాడు. హసరంగ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన పడిక్కల్‌.. తర్వాతి బంతికే అవుటయ్యాడు. శాంసన్‌ (7) మరోసారి విఫలం కాగా.. రాణా (9), భువనేశ్వర్‌ (13నాటౌట్‌) టీమ్‌ స్కోరును 130 పరుగులు దాటించారు. 



స్కోరు బోర్డు


భారత్‌: రుతురాజ్‌ (సి) భనుక (బి) షనక 21, ధవన్‌ (బి) అకిల 40,  పడిక్కల్‌ (బి) హసరంగ 29, శాంసన్‌ (బి) అకిల 7, నితీష్‌ రాణా (బి) ధనంజయ (సి) చమీర 9, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 13, నవ్‌దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 132/5; వికెట్ల పతనం: 1-49, 2-81, 3-99, 4-104, 5-130; బౌలింగ్‌: చమీర 4-0-23-1, కరుణరత్నె 1-0-6-0, అకిల ధనంజయ 4-0-29-2, ఉడాన 1-0-7-0, హసరంగ 4-0-30-1, షనక 2-0-14-1, మెండిస్‌ 2-0-9-0, ధనంజయ డిసిల్వ 2-0-13-0. 

శ్రీలంక: ఫెర్నాండో (సి) చాహర్‌ (బి) భువీ 11, మినోద్‌ భనుక (సి) చాహర్‌ (బి) కుల్దీప్‌ 36, సమరవిక్రమ (బి) వరుణ్‌ 8, షనక (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) కుల్దీప్‌ 3, ధనంజయ డిసిల్వ (నాటౌట్‌) 40, హసరంగ (సి) భువీ (బి) చాహర్‌ 15, మెండిస్‌ (సి) గైక్వాడ్‌ (బి) సకారియా 2, కరుణరత్నె  (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.4 ఓవర్లలో 133/6; వికెట్ల పతనం: 1-12, 2-39, 3-55, 4-66, 5-94, 6-105; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-21-1, సకారియా 3.4-0-34-1, వరుణ్‌ 4-0-18-1, రాహుల్‌ చాహర్‌ 4-0-27-1, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-30-2. 


Updated Date - 2021-07-29T09:32:35+05:30 IST