మెల్‌బోర్న్‌లోనే బాక్సింగ్‌ డే టెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-29T09:16:35+05:30 IST

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన షెడ్యూల్‌ అధికారికంగా ఖరారైంది. 69 రోజులపాటు సాగే పర్యటన వివరాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌లోనే బాక్సింగ్‌ డే టెస్ట్‌

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన షెడ్యూల్‌ 


మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన షెడ్యూల్‌ అధికారికంగా ఖరారైంది. 69 రోజులపాటు సాగే పర్యటన వివరాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం విడుదల చేసింది. బాక్సింగ్‌ డే టెస్ట్‌పై నెలకొన్న ఊహాగానాలకు కూడా తెరపడింది. సంప్రదాయం ప్రకారం డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లోనే బాక్సింగ్‌ డే మ్యాచ్‌ జరగనుంది. ఈ టెస్ట్‌ వీక్షణకు సుమారు 25 వేల మందిని అనుమతించే అవకాశం ఉంది. బీసీసీఐ డిమాండ్‌ మేరకు బాక్సింగ్‌ డే టెస్ట్‌, న్యూఇయర్‌ మ్యాచ్‌కు మధ్య వారంరోజుల విరామం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించారు. కాగా, అడిలైడ్‌లో డే/నైట్‌ మ్యాచ్‌కు ముందు సిడ్నీలో టీమిండియాకు అదనంగా పింక్‌ బాల్‌ వామప్‌ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ టూర్‌లో భారత్‌ 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్ట్‌ల సిరీ్‌సలు ఆడనుంది. నవంబరు 12న ఆస్ట్రేలియాకు భారత జట్టు బయల్దేరనుంది. 





Updated Date - 2020-10-29T09:16:35+05:30 IST