తొలిసారి ఒకే విమానంలో.. కోహ్లీ, మిథాలీ జట్లు ఇంగ్లండ్‌కు..

ABN , First Publish Date - 2021-05-18T06:08:11+05:30 IST

భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు ఒకే విమానంలో ప్రయాణిస్తూ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌తో...

తొలిసారి ఒకే విమానంలో.. కోహ్లీ, మిథాలీ జట్లు ఇంగ్లండ్‌కు..

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు ఒకే విమానంలో ప్రయాణిస్తూ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు విరాట్‌ కోహ్లీ సేన జూన్‌ 2న ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే భారత మహిళల జట్టు కూడా వచ్చే నెలలోనే ఇంగ్లండ్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అందుకే మిథాలీ రాజ్‌ బృందాన్ని కూడా పురుషుల జట్టుతో కలిపి ప్రత్యేక విమానంలో పంపేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ‘ఈనెల 19న ముంబైకి రావాల్సిందిగా చెప్పారు. అక్కడ కఠిన క్వారంటైన్‌ తర్వాత జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళతాం’ అని ఓ మహిళా క్రికెటర్‌ తెలిపింది. మరోవైపు ముంబైకి రాకముందే టీమిండియా ఆటగాళ్లకు మూడుసార్లు ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అలాగే కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మాత్రమే వేసుకోవాలని ఆటగాళ్లకు బోర్డు సూచించింది.


Updated Date - 2021-05-18T06:08:11+05:30 IST