కలికిరి ఐటీబీపీలో జవానుకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-02-27T15:10:33+05:30 IST

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతలో పాల్గొని అశువులు బాసిన కలికిరి ఐటీబీపీ జవాను ఎల్‌.బాలుచామి అంత్యక్రియలు తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలోని పోకై కరపట్టి గ్రామంలో

కలికిరి ఐటీబీపీలో జవానుకు కన్నీటి వీడ్కోలు

తమిళనాడులోని స్వస్థలంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు 

హాజరైన మదురై జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఎమ్మెల్యే 


చెన్నై/కలికిరి(ఆంధ్రజ్యోతి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతలో పాల్గొని అశువులు బాసిన కలికిరి ఐటీబీపీ జవాను ఎల్‌.బాలుచామి అంత్యక్రియలు తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలోని పోకై కరపట్టి గ్రామంలో శుక్రవారం జరిగాయి. కలికిరి పాలెంకొండ ఇండో టిబెటన్‌ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) 53వ బెటాలియన్‌ కు చెందిన జవాను ఎల్‌.బాలు చామి చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలోని సోనంపూర్‌ క్యాంపు సమీపంలో మందుపాతరకు బలై బుఽఽధవారం రాత్రి మర ణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయానికే బాలు చామి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలమైన పోకై కరపట్టి గ్రామానికి చేర్చారు. బాలుచామి మృతితో ఆయన భార్య, తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం ప్రభుత్వ లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కలికిరి ఐటీబీపీ బెటాలియన్‌ నుంచి పది మంది అధికారులు హాజర య్యా రు. మదురైలోని 45వ ఐటీబీపీ బెటాలియన్‌ కమాండెంట్‌ భానుప్రతాప్‌ సింగ్‌, డిప్యూటీ కమాండెంట్‌ రాజేష్‌కుమార్‌ మీనా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టరు అన్బుగజన్‌, జిల్లా ఎస్పీ సుజీత్‌ కుమార్‌, మదురై ఎమ్మెల్యే మూర్తి వీర జవాను అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పంపిన రూ. 20 లక్షల చెక్కును కలెక్టరు, ఎమ్మెల్యే, ఎస్పీ జవాను కుటుంబ సభ్యులకు అందజేశారు. 

Updated Date - 2021-02-27T15:10:33+05:30 IST