Advertisement
Advertisement
Abn logo
Advertisement

మదనాచారికి కన్నీటి వీడ్కోలు

స్వగ్రామం లక్ష్మీదేవికాల్వలో అంత్యక్రియలు 

యాదాద్రి, డిసెంబరు 1: క్రీడా పాత్రికేయుడు కంచనపల్లి మదనాచారికి (39) కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామమైన అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వలో బుధవారం విషణ్ణ వదనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు సహచరులు పా డెను మోస్తూ కన్నీటి పర్యంతంగా అంతిమయాత్ర కొనసాగింది. గ్రామం పక్కనే ఉన్న మదనాచారి వ్యవసాయక్షేత్రంలో ఖననం చేశారు. అయితే మదనాచారికి ఇటీవల డెంగీ జ్వరం సోకి అస్వస్థతకు గురికావడంతోపాటు కిడ్నీలో వాపు వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెం దారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మదనాచారి పాత్రికేయుడిగా ఎదిగారు. 2013నుంచి ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌ డెస్క్‌లో పనిచేస్తున్నారు. మదనాచారికి భార్య, ఇద్ద రు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియల్లో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్‌ మం దుల సామేల్‌, సర్పంచ్‌ నారగోని అంజయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది పాల్గొన్నారు.   

Advertisement
Advertisement