మావోయిస్టు నేత గంగన్నకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-06-20T05:57:48+05:30 IST

ఏఓబీ అడవుల్లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు డీసీఎం సంద గంగన్న అలియాస్‌ అశోక్‌ అంత్యక్రియలు ఆ యన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులలో నిర్వహించారు.

మావోయిస్టు నేత గంగన్నకు కన్నీటి వీడ్కోలు
గుంపులలో నిర్వహించిన గంగన్న అంతిమయాత్ర

- ఓదెల మండలం గుంపులలో అంత్యక్రియలు   

- నివాళులర్పించిన పలువురు నాయకులు

ఓదెల, జూన్‌ 19 : ఏఓబీ అడవుల్లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు డీసీఎం సంద గంగన్న అలియాస్‌ అశోక్‌ అంత్యక్రియలు ఆ యన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులలో నిర్వహించారు. ప్రజాసంఘాల నాయ కులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో అంతిమయాత్ర కొనసాగింది. అంతకుముందు గం గన్న మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు, ఇతరు గంగన్న మృతదేహంపై ఎర్రజండా కప్పి కన్నీటి నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అమరుల బంధుమిత్రుల కమి టీ సభ్యులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. గంగ న్న సోదరుడు ప్రభాకర్‌ కొడుకు రామకృష్ణ గంగన్న చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో సికాస వ్యవస్థాపకు డు ఉస్సేన్‌, టీవీఎస్‌ రాష్ట్ర నాయకులు కోట శ్రీని వాస్‌, బంధు మిత్రుల కమిటీ రాష్ట్ర జాయింట్‌ సెక్రె టరీ భవాని, ఉపాధ్యక్షురాలు శాంత, టీపీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అంజయ్య, విరసం నాయకుడు బాలసాని రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మావోయి స్టుల నేత గంగన్న మృతదేహం వద్ద పెద్దపల్లి మా జీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్‌, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్‌, కోడం స్వామి తదితర నాయకులు నివాళు లు అర్పించారు. 

బాక్సైట్‌, ఇతర ఖనిజాలను దోచుకునేందుకే..

అడవుల్లో బాక్సైట్‌, ఇతర ఖనిజాలను దోచుకు నేందుకు మావోయిస్టు నేతలు, దళ సభ్యులను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్యలు చేయిస్తున్నాయని సికాస వ్యవస్థాపకుడు ఎండీహుస్సేన్‌ ఆరోపించా రు. కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు సంద గంగన్న అలియా స్‌ అశోక్‌ అంత్యక్రియలకు అమరుల బంధు మిత్రు ల కమిటీ సభ్యులతో పాటు సికాస వ్యవస్థాపకులు ఎండీ హుస్సేన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బంఽధుమిత్రుల కమిటీ జాయింట్‌ సెక్రెటరీ భవాని, హుస్సేన్‌లు మాట్లాడుతూ సామ్రాజ్యవాదులకు, దో పిడీ పెట్టుబడిదారులకు అడవులను దోచిపెట్టేందు కు మావోయిస్టులు, ఆదివాసీలను కాల్చి చంపుతు న్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కా రం కోసం పోరాడుతున్న మావోయిస్టు నేత గంగ న్న,మరో ఐదుగురు నాయకులపై ఆకస్మికంగా దాడి చేసి కాల్చి చంపారని, నాయకత్వం తేరుకునేలోపు దొంగదెబ్బ తీశారన్నారు. ఇవి ఏకపక్ష కాల్పులు అ యినప్పటికీ ఎదురు కాల్పులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది ఏపీ ప్రభుత్వ హత్యాకాండ అని ఖండించారు. కొన ఊపిరితో ఉండగానే చేయి, కాలు విరిచి అతి దగ్గర నుంచి మావోయిస్టులను కాల్చి చంపారని అన్నారు. ప్రశ్నించే వారిని జైళ్లలో బంధిస్తూ ఇదే మిటని అడిగే ప్రజాసంఘాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిషేధం విధించాయని తెలిపారు. ప్ర జాజీవితంలోకి వస్తే వైద్యం చేయిస్తామంటున్న పో లీసులు అదే వైద్యం కోసం వచ్చేవారిని మావోయి స్టులను కాల్చివేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్‌ కథ అ ల్లుతున్నారని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ భూస్వా మ్య విధానాలను నిర్బంధంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటాలను అణచివేస్తున్నాయ న్నారు. టీవీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కోట శ్రీనివాస్‌ మా ట్లాడుతూ ఒక చేతితో ఆయుధం, మరో చేతితో వైద్యం చేస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తున్న గంగన్నను కాల్చి చంపారని, అడవిలో విఘతజీవిగా పడిఉన్న వారి దేహాలను ఇవ్వడానికి ప్రయత్నాలు చేయలేదన్నారు. అమరవీరుల బంధు మిత్రుల కమిటీ నేతలు, ఇతర నాయకులు గంగన్న తల్లి అమృతమ్మకు పాదాభివందనం చేశారు. 

Updated Date - 2021-06-20T05:57:48+05:30 IST