Abn logo
Sep 22 2020 @ 01:36AM

టీజర్‌ ‘చావు కబురు చల్లగా’

Kaakateeya

శవాలను శ్మశానవాటికకు తీసుకువెళ్లే వెహికల్‌ డ్రైవర్‌గా, బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠీ కథానాయిక. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సోమవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ విడుదల చేశారు. ‘నేను రోజూ చావులకు పోతా. అందరి ఏడుపులు చూసి చూసి... ఏడుపు అంటేనే చిరాకు వచ్చింది. కానీ, ఆ పిల్ల ఏడుత్తుంటే మాత్రం చేతికున్న వెంట్రుకలు ఇట్టా లేచి నించున్నాయిరా’ అని కార్తికేయ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చావు ఇంట్లో అమ్మాయిని చూసి కార్తికేయ ప్రేమలో పడతాడని ఊహించవచ్చు. నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ ‘‘ఇది రెగ్యులర్‌ సినిమా కాదని కచ్చితంగా చెప్పగలను. కార్తికేయ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అతని గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ సినిమా’’ అని చెప్పారు. ఆమని, భద్రం నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్‌రెడ్డి, సంగీతం: జేక్స్‌ బిజాయ్‌.


Advertisement
Advertisement
Advertisement