టెక్‌ వ్యూ: 11660 పైన రికవరీ

ABN , First Publish Date - 2020-02-28T06:56:57+05:30 IST

నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఇంట్రాడేలో 130 పాయింట్ల నష్టంతో కీలక స్థాయి 11600 కన్నా దిగజారింది. రెండో సెషన్‌లో ఆ స్థాయి కన్నా పైన రికవరీ సాధించి చివరికి 45 పాయింట్ల నష్టంతో ...

టెక్‌ వ్యూ: 11660 పైన రికవరీ

నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఇంట్రాడేలో 130 పాయింట్ల నష్టంతో కీలక స్థాయి 11600 కన్నా దిగజారింది. రెండో సెషన్‌లో ఆ స్థాయి కన్నా పైన రికవరీ సాధించి చివరికి 45 పాయింట్ల నష్టంతో క్లోజయింది. టెక్నికల్‌గా ఇది మైనర్‌ రికవరీ మాత్రమే. గత ఐదు రోజుల బలమైన డౌన్‌ట్రెండ్‌ అనంతరం ఏర్పడిన రికవరీగా దీన్ని భావించాలి. ఈ స్థాయిలో మైనర్‌ బాటమ్‌ మద్దతును పొందింది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే రానున్న కొద్ది రోజుల్లో కన్సాలిడేట్‌ కావాలి. 


శుక్రవారం స్థాయిలివే...

  • నిరోధం : 11660
  • మద్దతు : 11580

రికవరీ బాట పడితే పాజిటివ్‌ ధోరణిని కొనసాగించడానికి ఇంట్రాడే నిరోధం 11660 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 11720. ట్రెండ్‌ లో సానుకూలత కోసం మద్దతు స్థాయి 11600 కన్నా పైన మరొక రోజు బలంగా క్లోజ్‌ కావాలి.

మైనర్‌ మద్దతు స్థాయి 11580 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 11500. సాధారణ స్థితిలో తక్షణ డౌన్‌ట్రెండ్‌కు ఆస్కారం లేదు. 

- వి.సుందర్‌ రాజా

Updated Date - 2020-02-28T06:56:57+05:30 IST