ఒరే బాబ్జీ! ఇంటి దగ్గర్నించే పనిచేద్దాంరా!

ABN , First Publish Date - 2020-04-01T00:55:25+05:30 IST

బావుంది. సమస్యనేది ఎల్లకాలం ఉండిపోతుందా ఏంటి? రేపు అన్నీ సద్దుకోగానే జీవితాలు మళ్లీ మొదలవుతాయ్‌.

ఒరే బాబ్జీ! ఇంటి దగ్గర్నించే పనిచేద్దాంరా!

టెక్‌ టాక్‌ : ఇండియాలో ఇంటినెట్‌ ఎంప్లాయీస్‌


( రాంజీ, బాబ్జీ టెక్‌ డిస్కషన్‌ )

రాంజీ : చూశావ్‌రా బాబ్జీ జనాలు ఎంత బుద్ధిమంతులైపోయారో!

బాబ్జీ : ఇళ్లలో కూర్చోవడం సంగతేనా?


రాంజీ : కూర్చోవడం సరే. ఖాళీగా ఉండకుండా ఇంట్లో కొత్త విషయాలు నేర్చేసుకుంటున్నారట.

బాబ్జీ : ఈ కరోనా టెన్షన్లో చదువెలా వంటబడుతోందిరా బాబూ?


రాంజీ : బావుంది. సమస్యనేది ఎల్లకాలం ఉండిపోతుందా ఏంటి? రేపు అన్నీ సద్దుకోగానే జీవితాలు మళ్లీ మొదలవుతాయ్‌.

బాబ్జీ : నీ నోటి చలవని అలా జరగాల్రా బాబూ. అది సరే. ఏం నేర్చుకుంటున్నార్ట జనం?


రాంజీ : అదేరా. చాలా ఆఫీసులవాళ్లు ఇళ్లలోంచే పనిచేయాలని అంటున్నాయి కదా? అందుకే దానికుపయోగపడే టూల్స్‌ అన్నీ నేర్చుకుంటున్నారు. జనం... రిమోట్‌ టూల్స్‌... సీఆరెమ్‌ టూల్స్‌...

బాబ్జీ : అంటే..?


రాంజీ : అదేరా కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌... ఇంకా జూమ్‌తో వర్చువల్‌ మీటింగ్స్‌... ఇంకా జోహో...

బాబ్జీ : ఓహో...


రాంజీ : ఇంక గూగుల్‌ వాడి జి సూట్‌ .. ఇవన్నీ ఎలాగా ఉన్నాయ్‌.

బాబ్జీ : అంతా బానే ఉంది గానీ... నాకో డౌట్రా!


రాంజీ : ఏంటది?

బాబ్జీ : ఇంటర్‌నెట్‌ వచ్చి ఎంతో కాలం అయ్యింది కదా?


రాంజీ : అవును.

బాబ్జీ : బ్యాండ్‌ విడ్త్‌లు కూడా బాగా పెరిగాయ్‌ కదా?


రాంజీ : అవును.

బాబ్జీ : డేటా కాస్ట్‌ కూడా ఈ మధ్య బాగా తగ్గిపోయింది కదా?


రాంజీ : అవును. మరి అయితే ఏంటంటావ్‌?

బాబ్జీ : ఇలా ఇళ్లలోంచి పనిచేయడం అసలు ఎప్పుడో నేర్చుకుని ఉండాల్సింది కదా మనవాళ్లు?


రాంజీ : అవున్రా. కానీ ఇంత ప్రమాదం వస్తుందని ఊహించలేదు కదా ఎవరూనూ?

బాబ్జీ : అంటే... పీకల మీదకొచ్చినప్పుడే పరిష్కారం వెతుకుతారన్నమాట. ఆ మధ్య నోట్ల రద్దు తో రచ్చ రచ్చ అయితే గానీ.. ఎవడూ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ జోలికి పోలేదు. ఇప్పుడు కరోనా వచ్చి పడితే … ఇప్పుడు మొదలెట్టారు రిమోట్‌ వర్క్‌.. బుద్ధుండాలి.


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

రాంజీ : మనదేశం అంత ఎడ్వాన్స్‌డ్‌ కాదు కదరా బాబ్జీ?

బాబ్జీ : బావుంది. అంటే అన్నావంటారు గానీ ఒరే... అడ్డమైన చెత్త సినిమాలూ చూడ్డానికీ యూట్యూబ్‌లో వీడియోలు చూడ్డానికీ టెక్నాలజీ బానే వాడతారు. అదే ఆఫీసు పని చేయడానికి మాత్రం టూల్స్‌ తెలియవా?


రాంజీ : ఒరే మనది ఇండియా. వీళ్లకి రిమోట్లో పనిచేయడం వచ్చినా... అవతల ఆఫీసోళ్లు ఒప్పుకోవద్దూ? పని ఎగ్గొడతారని భయం.

బాబ్జీ : ఎగ్గొడితే చేసిందేంటో క్లియర్‌గా కనిపించదా ఏంటి? అన్నట్టు నీకు తెలుసా? ప్రమాదం మాట ఎలా ఉన్నా.. కరోనా లాక్‌ డౌన్‌ తరవాత పర్యావరణం బాగుపడిందట. ట్రాఫిక్‌ లేకపోవడంతో పెట్రోల్‌ కూడా బాగా ఆదా అవుతోందట.


రాంజీ : నిజమేరా. ఆఫీసుల్లో కూడా అన్నేసి ఏసీలూ … అంతంత మెయింటెనెన్సూ... అంతా వేస్టే. కరెక్ట్‌గా పనిచేయడం నేర్చుకుంటే మంచి కంప్యూటరూ, మంచి కనెక్షనూ ఉంటే చాలు. కనీసం ఈ కరోనా నించి బయటపడ్డాకయినా ఇండియాలో ఉద్యోగాల్లో మార్పులు వస్తాయేమో చూద్దాం!

బాబ్జీ : అవున్రా. ఆన్‌లైనే అసలైన సొల్యూషన్‌... నో పొల్యూషన్‌! అంతా ఆదాయే!



Updated Date - 2020-04-01T00:55:25+05:30 IST