అడుగడుగునా టెక్నాలజీ సపోర్ట్‌

ABN , First Publish Date - 2020-11-14T05:30:00+05:30 IST

కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి, ఇప్పటికే ఉన్న ఇంట్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మరింత

అడుగడుగునా టెక్నాలజీ సపోర్ట్‌

కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి, ఇప్పటికే ఉన్న ఇంట్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మరింత మెరుగైన సదుపాయాలు పొందాలనుకునే వారికి పలు స్మార్ట్‌ హోమ్‌ పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వివిధ  సెన్సార్లని అంతర్గతంగా నిక్షిప్తం చేస్తున్నారు. తద్వారా సులువుగా పనులు చేసుకునే విధంగా వీటిని రూపొందిస్తున్నారు. మీ ఇంటిని స్మార్ట్‌ హోమ్‌గా తయారు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న కొన్ని గ్యాడ్జెట్స్‌ గురించి ఇప్పుడు చూద్దాం.




ఇల్లు శుభ్రం చేయడానికి


దానంతట అదే ఇల్లు శుభ్రం చేయడానికి రోబోటిక్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్స్‌ వినియోగం ఇటీవల బాగా పెరిగింది.  స్మార్ట్‌ ఫోన్‌  అప్లికేషన్‌ ద్వారా వీటిని కంట్రోల్‌ చేసుకోవచ్చు. యాంటీ-కొలిజన్‌ ఏర్పాటు దీన్లో ఉంది. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు గోడలు, ఫర్నిచర్‌ వంటివాటికి తగిలి పాడవకుండా దూరంగా ఉంచేందుకు ఆ ఏర్పాటు ఉపయోగపడుతుంది.

మీ అవసరాన్ని బట్టి అనేక క్లీనింగ్‌ మోడ్స్‌ కూడా నిక్షిప్తమై ఉంటాయి. అలెక్స వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒక మోడల్‌ని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. https://amzn.to/3nd9erN




వాయిస్‌ రిమోట్‌


మీ ఇంట్లో ఉన్న టీవీ, ఎయిర్‌ కండిషనర్‌, హోమ్‌ థియేటర్‌, డిటిహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌, ఎయిర్‌ కూలర్‌ వంటి వాటన్నిటినీ ఒకే ఒక రిమోట్‌తో అది కూడా వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా నియంత్రించుకోవాలంటే ్ౖచOakremote WiFi Universal Remote ఉపయోగపడుతుంది. అన్ని రకాల ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ఉత్పత్తులను ఇది సపోర్ట్‌ చేస్తుంది.https://amzn.to/36tdYTh లింక్‌లో ఇది లభిస్తుంది.





వైఫైతో రంగుల్లోకి బల్బ్‌


బయటికి వెళ్లి మనకు కావాల్సిన రంగుల్లో బల్బ్‌ కొనే రోజులు పోయాయి. ఇప్పుడు ఒక బల్బ్‌ కొంటే చాలు, మిలియన్ల కొద్దీ రంగుల్లో మీకు కావాల్సిన దానికి సులభంగా మారిపోవచ్చు.

ఇటీవలికాలంలో స్మార్ట్‌ బల్బ్‌ల వినియోగం బాగా పెరిగింది. ఇవి కూడా స్మార్ట్‌ హోమ్‌ కోవకు చెందిన ఉత్పత్తులే. అమెజాన్‌ అలెక్స, గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా వాయిస్‌ కమాండ్లతో వీటిని వాడుకోవచ్చు. https://amzn.to/2IyuOYv

లింక్‌లో ఇలాంటి ఒక బల్బ్‌ని ఎంపిక చేసుకోవచ్చు.




స్మార్ట్‌ ప్లగ్‌

ఇంట్లో ప్లగ్‌లకి ఏదైనా ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలు కనెక్ట్‌ చేసినప్పుడు వాటిని ఆన్‌ ఆఫ్‌ చేయడం కోసం స్విచ్‌ బోర్డు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటీవలికాలంలో విస్తృతంగా 

లభిస్తున్న ‘స్మార్ట్‌ ప్లగ్స్‌’ని వాడితే చాలు, వాటికి కనెక్ట్‌ చేసే ఎలాంటి పరికరాన్నయినా మీ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌/ఆఫ్‌ చేయొచ్చు, అంతేకాదు ఒక నిర్దిష్టమైన సమయానికి దానంతట అదే ఆన్‌ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్లతో ఇలాంటి ప్లగ్‌లను నియంత్రించుకోవచ్చు. వైఫై ఆధారంగా ఇవి పని చేస్తాయి. ఈ కోవకు చెందిన ఒక స్మార్ట్‌ ప్లగ్‌ ఇక్కడ లభిస్తోంది. https://amzn.to/3neddUY





స్మార్ట్‌ లాక్‌

కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా? మామూలు లాక్‌ బదులు స్మార్ట్‌ లాక్‌ కోసం ప్రయత్నించండి. దానిద్వారా ఫింగర్‌ ప్రింట్‌, పాస్‌కోడ్‌, బ్లూటూత్‌, ఎన్‌ఎఫ్‌సి కార్డ్‌, ఎమర్జెన్సీ కీస్‌ ఆధారంగా మాత్రమే ఎవరైనా లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా 100 ఫింగర్‌ప్రింట్‌లు నమోదు చేయొచ్చు. అతిథుల కోసం కేవలం పరిమిత కాలం పనిచేసే విధంగా ఓటిపి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ సమయం పూర్తయిన తరవాత వారు మీ ఇంట్లో ప్రవేశించడానికి సాధ్యపడదు. అలాంటి ఒక మోడల్‌ని https://amzn.to/3luIiDy లింక్‌లో కొనుగోలు చేయొచ్చు.




మనుషులు లేనప్పుడు ఆరిపోయేలా

మోషన్‌ సెన్సార్‌ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తూ కేవలం తనకు సమీపంలోకి మనుషులు వచ్చినప్పుడు మాత్రమే దానంతట అది వెలిగి, తదుపరి ఆటోమేటిక్‌గా అరిపోయే విధంగా లైట్‌ కోసం చూస్తున్నారా? అయితే ఈ సదుపాయం కలిగిన లైట్లు ఈ మధ్య అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. విద్యుత్తును ఆదా చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి. అపార్ట్‌మెంట్లు, ఇళ్లల్లో మెట్లమీద అమర్చుకోవడానికి ఈ తరహా లైట్లు అనుకూలంగా ఉంటాయి. https://amzn.to/2JWZYJT అనే లింక్‌లో టైం అడ్జస్ట్‌మెంట్‌, ఇతర సదుపాయాలు కలిగిన ఇలాంటి ఒక లైట్‌ని పొందొచ్చు.




స్మార్ట్‌గా గాలిని శుభ్రం చేస్తూ!

పరిశుభ్రమైన గాలి అవసరం బాగా పెరుగుతోంది. శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఎయిర్‌ ప్యూరిఫైయర్లు వాడుతున్న కాలమిది. ఈ నేపధ్యంలో వైఫై ఆధారంగా పని చేస్తూ ఎప్పటికప్పుడు పొల్యూషన్‌ దెబ్బలు చూపించడంతో పాటు పూర్తిస్థాయిలో రిపోర్ట్స్‌ అందించే విధంగా స్మార్ట్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్లు లభిస్తున్నాయి. 99.97ు శాతం సమర్థతను కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు గది ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని కూడా తెలియజేసే విధంగా ఇవి పని చేస్తాయి. గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్స సపోర్ట్‌ కలిగిఉండే అలాంటి ఓ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను ఇక్కడ పొందొచ్చు https://amzn.to/36rRd2a




ఇంటి సెక్యూరిటీ కోసం


ఇంటి భద్రత కోసం ఖరీదైన సెక్యూరిటీ కెమెరాలను అమర్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. తక్కువ ధరలో 360 డిగ్రీల కోణంలో పనిచేస్తూ ఫుల్‌ హెచ్‌డి రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్‌ చేసే చిన్న పరిమాణం కలిగిన సెక్యూరిటీ కెమెరాలు కూడా ఇటీవలికాలంలో మన ఇంటిని స్మార్ట్‌ చేస్తున్నాయి. కేవలం మెమరీ కార్డు అమర్చుకుంటే చాలు, వీడియో రికార్డ్‌ అవుతుంది. రాత్రిపూట కదలికలను కూడా స్పష్టంగా రికార్డు చేయగలిగే నైట్‌ విజన్‌ సదుపాయాలు కూడా ఇలాంటి కెమెరాల్లో ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి కెమెరా వాడాలంటే https://amzn.to/36sscnt  అనే లింక్‌లో కొనుగోలు చేయవచ్చు.




స్మార్ట్‌ డోర్‌ బెల్‌

ఎవరైనా ఇంటి బెల్‌ కొట్టినప్పుడు తెలిసినవారు అయితే ప్రమాదం లేదు కానీ, అపరిచితులతో ఇబ్బంది ఏర్పడుతుంది కదా! దీనికోసమే వైఫై ఆధారంగా పనిచేసే వీడియో డోర్‌ బెల్‌ ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో అనేక రకాల స్మార్ట్‌ డోర్‌ బెల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ డోర్‌ బెల్‌ అమర్చుకుంటే చాలు, మీ ఇంటి గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తిని మీ ఫోన్‌ ద్వారా ఇంట్లో నుంచి కానీ ఆఫీస్‌ నుంచి గానీ గమనించవచ్చు. అవసరమైతే వారితో మాట్లాడవచ్చు. మీరు ఇంట్లో లేని సమయంలో కొరియర్‌ వ్యక్తులు వచ్చినా కూడా వారికి ఆదేశాలు ఇవ్వొచ్చు. రాత్రి సమయంలో కూడా పనిచేసే ఈ స్మార్ట్‌ డోర్‌బెల్‌ని https://amzn.to/36wN5xI   లింక్‌ నుంచి పొందొచ్చు.




స్మార్ట్‌ డిస్‌ప్లే

గూగుల్‌ హోమ్‌, అమెజాన్‌ ఎకో షో వంటి స్మార్ట్‌ డిస్‌ప్లేలను దాదాపు అందరూ ఇష్టపడుతున్నారు. వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా అన్ని రకాల సమాచారం తెలుసుకోవడంతో పాటు, కావాల్సిన వీడియోలు, పాటలు ప్లే చేసుకునే సదుపాయం కూడా వీటిలో ఉంటుంది. ఇదే కోవలో లభిస్తున్న అమెజాన్‌ అలెక్స ఆధారంగా పనిచేేస Echo Sow 8ని తీసుకుంటే 8 అంగుళాల పరిమాణం ఇది కలిగి ఉంటుంది. వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా కాల్స్‌ చేసుకోవచ్చు, మెసేజ్‌ పంపించుకోవచ్చు, నచ్చిన వీడియోలు ప్లే చేసుకోవచ్చు, ఇతర డివైజ్లకు కనెక్ట్‌ కావచ్చు. https://amzn.to/32CERTJఅనే లింక్‌లో ఇది లభిస్తుంది.




ఇలా అనేక రకాల స్మార్ట్‌ డివైసెస్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులు మున్ముందు ఆటోమేటిక్‌గా, మరింత సమర్థంగా చెయ్యడానికి ఈ పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయి.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar


Updated Date - 2020-11-14T05:30:00+05:30 IST