అద్భుతమైన ఫీచర్లు.. అతి తక్కువ ధర: భారత మార్కెట్లోకి నయా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్

ABN , First Publish Date - 2020-12-05T01:02:57+05:30 IST

భారత్‌ మార్కెట్లోకి మరో నయా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వచ్చేసింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ ట్రాన్షన్ హోల్డింగ్స్ ‘టెక్నో పోవా’ పేరుతో

అద్భుతమైన ఫీచర్లు.. అతి తక్కువ ధర: భారత మార్కెట్లోకి నయా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్

న్యూఢిల్లీ: భారత్‌ మార్కెట్లోకి మరో నయా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వచ్చేసింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ ట్రాన్షన్ హోల్డింగ్స్ ‘టెక్నో పోవా’ పేరుతో సరికొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. యువ వినియోగదారులను లక్ష్యంగా రెండు స్టోరేజీ వేరియంట్లు విడుదల చేసింది. 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించింది. ఇతర ముఖ్యమైన హైలైట్స్ విషయానికి వస్తే మీడియా టెక్ హెలియో జి80 ఎస్ఓసీ, హోల్‌పంచ్ డిస్‌ప్లే డిజైన్, క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి. పోకో ఎం2, రెడ్‌మి 9ప్రైమ్‌లకు టెక్నోపోవా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 


టెక్నో పోవా 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో రూ. 9,999 కాగా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 11,999 మాత్రమే. పలు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్‌‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 11 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.  


టెక్నో పోవా స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, అండర్ ది హుడ్, ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో జి80 ఎస్ఓసీ, 16 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా, 64 జీబీ, 128జీబీ అంతర్గత మెమొరీ ఆప్షన్లు, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.   

Updated Date - 2020-12-05T01:02:57+05:30 IST