Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలోచనాశక్తిని పెంచుకోవాలి

ఆలోచనాశక్తిని పెంచుకోవాలి

 లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ ఎం. శ్రీనివాసరావు

లబ్బీపేట, డిసెంబరు 8: ప్రతి విద్యార్థి తన ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ ఎం. శ్రీనివాసరావు అన్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో బుధవారం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ ఈవెంట్‌ టెక్‌స్పార్క్స్‌- 2కే 21 ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక అంశాన్ని తీసుకుని దానిలో ప్రాజెక్ట్‌ను డెవలప్‌ చేయడం ద్వారా ఒక వ్యవస్థాపకుడిగా ఎదగగలడని, ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఇమిడి ఉన్న ప్రతిభను వెలికి తెచ్చే వేదికగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఎన్విరాన్‌మెంట్‌కు అనుసంధానం చేసుకోవాలని దాని ద్వారా మనం ఎన్నో విపత్తులను అధిగమించవచ్చన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 103 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి. విజయలక్ష్మి, ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ ఎస్‌.కల్పన, వి.ఎస్‌.పవన్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement