Abn logo
Sep 28 2021 @ 10:49AM

అర్ధరాత్రి కూతురి గది నుంచి కేకలు.. ఏమైందోనని వెళ్లగా.. అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న తండ్రి..!

భరత్‌పూర్: అర్ధరాత్రి కూతురి గది నుంచి ఏదో అలజడి రావడంతో తండ్రి నిద్రలేచాడు. ఏమైందోనని అక్కడికి వెళ్తుంటే గది నుంచి ఓ వ్యక్తి పారిపోవడం గమనించాడు. పట్టుకుందామనుకునేలోపు అతడు పారిపోయాడు. దొంగతనం చేయడానికి వచ్చాడేమోనని తండ్రి అనుమానించాడు. కానీ ఆ తర్వాత కూతురు అసలు విషయం చెప్పడంతో కుప్పకూలిపోయాడు. అసలు విషయానికొస్తే..


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన అంకిత్ అనే ఓ వ్యక్తి తన ప్రాంతంలోనే నివసించే ఓ 15ఏళ్ల యువతిపై కన్నేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ కామంధుడు అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. పైగదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిందగదిలో పడుకున్న తండ్రికి పైగది నుంచి ఏవో శబ్ధాలు రావడంతో నిద్రలేచాడు. ఏమైందోనని పైకెళ్తుండగా కూతురి గది నుంచి ఓ యువకుడు పారిపోవడం గమనించాడు. దొంగేమోనని ముందుగా అనుకున్నాడు. కానీ కూతురి గదిని గమనించగా ఆయనకు ఏదో అనుమానం కలిగింది. యువతి జరిగిన విషయం చెప్పడంతో ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. అంకిత్ అనే వ్యక్తి తనను అత్యాచారం చేశాడని తెలిపింది. తన నోటిలో దుస్తులు ఉంచి, అరిస్తే చంపేస్తానని బెదిరించాడని వివరించింది. పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...