Abn logo
Sep 24 2021 @ 00:50AM

తెగని నిజాం షుగర్స్‌ లే ఆఫ్‌

జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కర కర్మాగారము

తాజాగా సీఎం కేసీఆర్‌కు ఎంపీ అర్వింద్‌ లేఖ

నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న విచారణ

ఆరేళ్లు సమీపిస్తున్నా తెగని సంకెళ్లు

జగిత్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నీటి లభ్యత లేదంటూ అర్ధాంతరంగా లే ఆఫ్‌ ప్రకటించి మూసివేసిన నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఫ్యాక్టరీ మూసివేసి ఆరేళ్లు సమీపిస్తున్నా లే ఆఫ్‌ సంకెళ్లు తెగడం లేదు. మ ల్లాపూర్‌ మండలం ముత్యంపేట, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మెదక్‌ జిల్లా ముంబోజుపల్లిలలో గల ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారాల లే ఆఫ్‌ చట్ట బద్దమా, చట్ట విరుద్దమా అనే అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం 2017లో లేబర్‌ కోర్టుకు అప్పగించింది. నాలుగేళ్లు సుదీర్ఘ విచారణ చేసిన అనం తరం 2021 జూలైలో లే ఆఫ్‌ చట్ట బద్దమేనంటూ లేబర్‌ కోర్టు తేల్చివే సింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ వద్దకు వెళ్లింది. ప్రస్తుతం ట్రిబ్యూనల్‌ వద్ద విచారణ కొనసాగుతోంది. 

ఆరేళ్లుగా కొలిక్కిరాని సమస్య....

ఎన్‌ఎఎస్‌ఎల్‌ లే ఆప్‌ ఎత్తివేత సమస్య సుమారు ఆరేళ్లుగా కొలిక్కి రావడం లేదు. మరోవైపు మూడు యూనిట్లకు చెందిన కర్మాగారాల యంత్రాలు తుప్పు పట్టి స్ర్కాబ్‌గా మారుతున్నాయని కార్మికులు, రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీలను 2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డెల్టా పేపర్స్‌ లిమిటెడ్‌కు అప్పగించి ప్రైవేటు పరం చేసింది. ప్రైవేటు పరం చేసిన సందర్భంలో అప్పటి టీడీపీ సర్కా రు అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై వైఎస్సాఆర్‌ ప్రభు త్వం 2006లో నియమించిన శాసన సభ సంఘం అక్రమాలు జరిగా యని నివేదిక ఇచ్చింది. అనంతరం 2015 డిసెంబర్‌ 23వ తేదిన కర్మాగారానికి లే ఆఫ్‌ ప్రకటించి యాజ మాన్యం మూసివేసింది.  


సహకార పద్ధతిలో నిర్వహణకు సర్కారు సై...

సహకార పద్ధతిలో నడపడానికి ముందుకు వస్తే రైతులకు కర్మాగా రాల నిర్వహణ అప్పగిస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రైతులు మొగ్గు చూపడం లేదు. సుమారు మూడేళ్లక్రితం చెరుకు రైతులతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశమయ్యారు. మహారాష్ట్రలో సహకార పద్ధ తిలో నడుస్తున్న చక్కెర కర్మాగారాల మాదిరిగా ఎన్‌డీఎస్‌ఎల్‌ యూని ట్లను రైతులకు అప్పగించడానికి సుముఖుత వ్యక్తం చేశారు. అనంతరం ముత్యంపేట, బోదన్‌, ముంబోజుపల్లి యూనిట్ల పరిధిలోని పలువురు చెరుకు రైతులతో మహారాష్ట్రలో అధ్యయన యాత్రను సర్కారు నిర్వ హించింది. అయినప్పటికీ సహకార పద్ధతిలో నడపడానికి రైతులు ముం దుకు రాకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చం దంగా మారింది. ఈనేపథ్యంలో లే ఆఫ్‌ చట్టబద్దమే అంటూ లేబర్‌ కో ర్టు తేల్చడం, ఎన్‌సీఎల్‌టీ వద్దకు విచారణకు వెళ్లడం రైతులను, కార్మి కులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. 


సీఎం కేసీఆర్‌కు ఎంపీ అర్వింద్‌ లేఖ....

లే ఆఫ్‌తో మూసివేసిన నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ ఎల్‌)కర్మాగారాలను వెంటనే తెరిపించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు 10 రోజుల క్రితం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖ రాశారు. ముత్యంపేట, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మెదక్‌ జిల్లా ముంబోజుపల్లి కర్మాగారాలను తెరవాలని కోరుతూ లేఖను పంపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిపిన ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వ చ్చిన వంద రోజుల్లోపు కర్మాగారాలను తెరిపిస్తామని హామీనిచ్చి నప్ప టికీ ఇప్పటివరకు నెరవేరడం లేదని తెలిపారు. 


ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొని రావాలి

మామిడి నారాయణరెడ్డి, చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షు డు, ముత్యంపేట

ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొని రావాలి. గతంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ ఎల్‌లను తెరిపించాలి. ప్రభుత్వం ఆద్వర్యంలో కర్మాగారాలను నిర్వహిం చాలి. ఎన్‌డీఎస్‌ఎల్‌ లే ఆఫ్‌ తక్షణమే ఎత్తివేయాలి. చెరుకు రైతుల సం క్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.