తహసీల్దార్‌ కార్యాలయ

ABN , First Publish Date - 2020-09-18T07:26:03+05:30 IST

అద్దంకి పట్టణంలో కూర గాయల వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. సమీపంలో ఉన్న మార్టూరు మార్కెట్‌లో కూరగాయల ధరలతో అద్దంకి

తహసీల్దార్‌ కార్యాలయ

సీనియర్‌ అసిస్టెంట్‌ రమణరావు

కూరగాయల వ్యాపారుల నిలువు దోపిడీ

అత్యధిక రేట్లు...తూకాలలో తేడా   నష్టపోతున్న

వినియోగదారులు

అధికారుల తనిఖీలలోనూ తేటతెల్లం


అద్దంకి, సెప్టెంబరు 17 :  అద్దంకి పట్టణంలో కూర గాయల వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. సమీపంలో  ఉన్న మార్టూరు మార్కెట్‌లో కూరగాయల ధరలతో  అద్దంకి పట్టణంలో వ్యాపారులు అమ్మే ధరలను పరిశీలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంటున్నాయి. విని యోగదారుల ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎఫ్‌ఐ విజ యశేఖరరెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమణరావు సాధారణ వ్యక్తులు లా  కూరగాయల వ్యాపా రుల వద్దకు వెళ్లి ధరలను అడిగారు.


అదే సమయంలో మార్టూరు కూరగాయల మార్కెట్‌ లో ధరలను కనుక్కొని వ్యత్యాసం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. మార్టూరు మా ర్కెట్‌లో కిలో పచ్చి  మిర్చి 40 రూపాయలు ఉండగా అ ద్దంకిలో 100 నుంచి 110 రూపాయలు అమ్ముతున్నారు. బంగాళదుంప రూ.25 కాగా రూ.60 కాకర రూ.25  కాగా రూ.80, టమోట రూ.40 కాగా రూ.60, దొండకాయలు రూ. 20 కాగా రూ.40 రూపాయలు, బెండ కాయలు  రూ.25 కా గా  రూ.50, వంకాయలు  రూ.25 కాగా  రూ.80  విక్రయిస్తున్నారు.


మార్టూరులో హోల్‌సేల్‌గా కొనుగోలు చేసే స మయంలో ధరలు మరింత తక్కువగా ఉంటాయి.  మా ర్టూరు నుంచి అద్దంకి 30 కి.మీ. దూరం మాత్ర మే ఉం టుంది.  ఈ నేపథ్యంలో వ్యాపారులు రవాణా ఖర్చులు  లెక్క వేసినా కిలోకు  50పైసలు నుంచి రూపా యికి మిం చి  ఉండదు.  వ్యాపారులు కిలోకు 10 రూపాయల లాభం తో అమ్మకాలు చేయటం న్యాయమని అలా కాకుండా వ్యాపారులు అందరూ సిండికేట్‌ గా మారి రెట్టింపు.

Updated Date - 2020-09-18T07:26:03+05:30 IST