లండన్ మహిళతో ఖమ్మం ఉద్యోగి ఫేస్‌బుక్ పరిచయం.. చివరికి..

ABN , First Publish Date - 2021-03-23T18:08:32+05:30 IST

ఫేస్ బుక్ పరిచయం ఓ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి కొంపముంచింది. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కారేపల్లి రెవెన్యూ సీనియర్ ...

లండన్ మహిళతో ఖమ్మం ఉద్యోగి ఫేస్‌బుక్ పరిచయం.. చివరికి..

ఖమ్మం: ఫేస్‌బుక్ పరిచయం ఓ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి కొంపముంచింది. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కారేపల్లి రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్‎గా పని విధులు నిర్వహిస్తున్న సుధీర్.. నెల రోజుల క్రితం రోస్లీ నికోలస్ అనే లండన్ మహిళతో ఫేస్‎బుక్‎లో ప్రెండ్ రిక్వస్ట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అప్పటి నుంచి ఫేస్‎బుక్‎లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే కొద్దీ రోజుల క్రితం రోస్లీ నికోలస్‌ మీ పేరు మీద రూ.50 వేల డాలర్లు పంపించారని, తాను కస్టమ్స్‌ అధికారినని కవితా శర్మ సుధీర్‎కు కాల్ చేసి తనతో పరిచయం ఏర్పరచుకుంది. 


అయితే.. కొన్ని రోజులుగా ఇద్దరు ఆన్‎లైన్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఒకరోజు తాను ఇండియా రావాలనుకుంటానని.. అయితే ఆదాయ ట్యాక్స్‎తో పాటు ఇతర ఖర్చులు ఉంటాయని మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుంది. దీంతో సుధీర్ దగ్గర రూ.10 లక్షల 72 వేల 500లను కవితా శర్మ తన వేర్వేరు ఖాతాల్లో డబ్బులు వేయించుకుంది. అయితే.. ఇప్పటికీ డాలర్ల సొమ్ము సుధీర్‎కు రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే సుధీర్ తన ఫోన్ నుంచి కవితా శర్మకు కాల్ చేసి.. డాలర్లు వద్దు తన డబ్బులు రిటర్న్ చేయమని కోరాడు. అలా కుదరదని చెప్పి.. చివరగా ఇంకో లక్ష అకౌంట్‎లోకి ట్రాన్స్‎ఫర్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు (రెవెన్యూ ఉద్యోగి) సోమవారం పోలీస్ స్టేషన్‎కు వెళ్లి జరిగిన విషయం తెలిపాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-03-23T18:08:32+05:30 IST