తహసీల్దారు కార్యాలయమా... వాహనాల పార్కింగ్‌ ప్రదేశమా!

ABN , First Publish Date - 2021-07-29T04:45:13+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ విధులతో పాటు అదనంగా ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్నారు. కార్యాలయ ఆవరణలోనే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల వ్యాపారాలు చేస్తున్నారు.

తహసీల్దారు కార్యాలయమా... వాహనాల పార్కింగ్‌ ప్రదేశమా!
ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో భారీ సంఖ్యలో పార్కింగ్‌ చేసిన వాహనాలు

ప్రొద్దుటూరు అర్బన్‌, జూలై 28 : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ విధులతో పాటు అదనంగా ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్నారు. కార్యాలయ ఆవరణలోనే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇందుకు ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణ వేదికయ్యింది. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను తహసీల్దారు కార్యాలయ ఆవరణలోనే పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇదే ఆవరణలోనే ఉన్న ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ అధికారులకు ఎందుకు ఇన్ని వాహనాలు ఇక్కడ రోజు పార్కింగ్‌ చేస్తున్నారో తెలిసినా వారు చూసీచూడ నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివరా ల్లోకి వెళితే.... ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయ ఆవ రణలో ఫైర్‌స్టేషన్‌, అగ్రికల్చర్‌ కార్యాలయం, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, ట్రెజరీ కార్యాలయం, డిప్యూటీ డీఈవో కార్యాలయం, పెన్షనర్స్‌ భవనాలు ఉన్నాయి. ఇక్కడ కార్యా లయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు అమ్మడం, కొనడం లాంటి వ్యాపా రాలు ఇక్కడే  పార్కింగ్‌ చేసి కొనసాగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 20 వాహనాలు ఉంటున్నాయి. దీంతో ప్రతిరోజు ఈ కార్యాలయాలకు వచ్చే వారి వాహ నాలు పార్కింగ్‌ చేయడానికి స్థలం ఉండటం లేదు. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. ఖాళీ ప్రదేశం మొత్తం కార్లు, ఇన్నోవాలతో నిండి పోవడంతో ద్విచక్ర వాహనాలు రోడ్లపై పార్కింగ్‌ చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు యాక్సిడెంట్‌ వాహనాలను స్టేషన్‌లో పెట్టుకోవడానికి సైతం స్థలం లేకపోవడం గమ నార్హం.  ప్రభుత్వ అధికారులై ఉండి ప్రభుత్వ స్థలాన్ని ఇలా అనధికార పార్కింగ్‌కు వినియోగించటంపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కార్యా లయాలకు వచ్చే సిబ్బందికి, ప్రజలకు వాహనాల పార్కిం గ్‌కు వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

Updated Date - 2021-07-29T04:45:13+05:30 IST