Apr 19 2021 @ 11:10AM

ఇష్క్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి కాన్సెప్ట్‌: తేజ స‌జ్జ‌

యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌23న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో  హీరో తేజ స‌జ్జ మాట్లాడుతూ  ``మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో వ‌ర్క్ చేయ‌డం ఒక గౌర‌వంగా భావిస్తున్నాను.  మంచి కంటెంట్ ని ప్రోత్స‌హించ‌డానికి  ఇక్క‌డికి వ‌చ్చిన వేణు శ్రీ‌రామ్‌, నందినీ రెడ్డి, నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, శ్రీ విష్ణు, ప్ర‌శాంత్ వ‌ర్మ గారికి థ్యాంక్స్‌.మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలనే  మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌ వారు ప్రొత్సహిస్తుంటారు. ‘ఇష్క్‌’ సినిమాలో కూడా మంచి  సోల్ ఉంది. ఇది ఒక కొత్త రకం కథ.  ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వ‌ర‌కూ ఏ సినిమా రాలేదు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి  కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.  మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీ.. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె. నాయుడుగారికి, ఎడిట‌ర్ ఎ. వ‌ర‌ప్ర‌సాద్ గారికి థ్యాంక్స్‌. ద‌ర్శ‌కుడు రాజుగారు చాలా పెద్ద పెద్ద సినిమాల‌కి వ‌ర్క్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని పెద్ద సినిమాల‌కి వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ నైస్ కోస్టార్‌. ఈ సినిమాలో చాలా బాగా చేసింది.  ఏప్రిల్ 23న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాని అంద‌రూ  చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.