Tejashwi Yadav గురించి అతని భార్య, ప్రియురాలు రాజశ్రీ ఏం చెప్పిందంటే...

ABN , First Publish Date - 2021-12-14T15:00:23+05:30 IST

బీహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్, రాజశ్రీలు ప్రేమ పెళ్లి అనంతరం మొదటిసారి తన స్వస్థలమైన పట్నా నగరానికి తిరిగి వచ్చారు....

Tejashwi Yadav గురించి అతని భార్య, ప్రియురాలు రాజశ్రీ ఏం చెప్పిందంటే...

తేజస్వీయాదవ్‌తో చాలాకాలంగా పరిచయం ఉంది..ఆయన పెద్ద మేధావి, స్మార్ట్...నూతన వధువు రాజశ్రీ వ్యాఖ్యలు

పట్నా(బీహార్): బీహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్, రాజశ్రీలు ప్రేమ పెళ్లి అనంతరం మొదటిసారి తన స్వస్థలమైన పట్నా నగరానికి తిరిగి వచ్చారు. ఈ కొత్త జంటతోపాటు తేజస్వీ తల్లిదండ్రులైన మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలు కలిసి పాట్నా విమానాశ్రయంలో కనిపించారు. తేజస్వీ తన బాల్య స్నేహితురాలైన రాచెల్‌ను రాజశ్రీగా మార్చి ఢిల్లీలోని తేజస్వీ సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో పెళ్లి  చేసుకున్నారు. భర్తతో కలిసి వచ్చిన కొత్త కోడలు రాజశ్రీని ప్రశ్నించగా పలు విషయాలు వెల్లడించారు.


‘‘నాకు తేజస్వీ అంటే ఎంతో ఇష్టం, ఆయన పెద్ద మేధావి, స్మార్ట్, యువనేత’’ అని రాజశ్రీ చెప్పారు. రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోవడం గురించి మీరెలా భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు రాజశ్రీ సమాధానం ఇచ్చారు. ‘‘తేజస్వీ యాదవ్ ప్రజా జీవితంలోకి రాకముందే నాకు తెలుసు’’ అని రాజశ్రీ వ్యాఖ్యానించారు.తన బాల్య స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులైన లాలూ,రబ్రీలకు చెప్పి ఒప్పించిన తర్వాతే వివాహం చేసుకున్నానని తేజస్వీ చెప్పారు. తమ వివాహాన్ని రెండు కుటుంబాలు ఆశీర్వదించాయని ఆయన పేర్కొన్నారు. 


మేం బీహార్ కు వచ్చిన తర్వాత ప్రజలకు రిసెప్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తేజస్వీయాదవ్ చెప్పారు. ‘‘మేము కోరుకున్నది ఇదే, మా జంటను ఆశీర్వదించడానికి మా రెండు కుటుంబాలు కలిసి ఉండాలి.’’అని భావించానని తేజస్వీ భార్య రాజశ్రీ చెప్పారు. ‘‘మా ఇద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది. నేను పెళ్లి చేసుకునేందుకు నా జీవితంలో ఒక అమ్మాయి ఉందని మా నాన్నకు చెప్పాను.దీంతో రెండు కుటుంబాలు కలుసుకుని మా ప్రేమను అంగీకరించాయి’’ అని తేజస్వీ యాదవ్ చెప్పారు. కొవిడ్ -19 మహమ్మారి, గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు,తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా  పెళ్లి ప్రణాళిక ఆలస్యం అయిందని బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వీ యాదవ్ వివరించారు.


Updated Date - 2021-12-14T15:00:23+05:30 IST