దూసుకెళుతున్న తేజస్వీ

ABN , First Publish Date - 2020-10-21T10:12:01+05:30 IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారే సూచన లు కనిపిస్తున్నాయి.

దూసుకెళుతున్న తేజస్వీ

న్యూఢిల్లీ, అక్టోబరు 20: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారే సూచన లు కనిపిస్తున్నాయి. సీఎ్‌సడీఎ్‌స-లోక్‌నీతి సర్వేలో ఎన్డీయేకు 6ు ఎక్కువ ఓట్లు రావొచ్చని తేలినా.. లోక్‌ జనశక్తి, జీఎ్‌సడీఎఫ్‌ కూటమి భారీగా ఓట్లు చీల్చే అవకాశాలున్నట్లు తేలింది. దీంతో పరిస్థితి హంగ్‌ దిశగా మారే సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీ-జేడీయూ కూటమి (ఎన్డీయే)కి 38ు, ఆర్జేడీ-కాంగ్రె్‌స-లెఫ్ట్‌(మహాకూటమి)కి 32ు ఓట్లు రావొచ్చని, ఎల్జేపీకి 5ు, జీఎ్‌సడీఎ్‌ఫకి 7ు, ఇండిపెండెంట్లు-ఇతరులకు 17ు ఓట్లు లభించవచ్చని సర్వే అంచనా వేసింది. ఇక సీఎం రేసులో నితీశ్‌ కుమార్‌ 31ు మంది మద్దతుతో ముందున్నారు.


అయి తే మహాకూటమి తరఫు సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ అనూహ్యం గా పుంజుకొని 27ు మంది మద్దతు సాధించారని సర్వే తెలిపింది. లాలూ వారసుడిగా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న తేజస్వీ ప్రజాదరణను పుంజుకొన్నారని, గత ఐదేళ్లలో లాలూ కుటుంబం 21ు ఆదరణ సాధించిందని సర్వే పేర్కొంది. ఉపేంద్ర కుశవాహా-మాయావతి-అసదుద్దీన్‌ ఒవైసీ కూటమి ఓట్లు చీలుస్తుందని సర్వే తెలిపింది.

Updated Date - 2020-10-21T10:12:01+05:30 IST