నిధుల దుర్వినియోగంపై విచారణ చేయండి

ABN , First Publish Date - 2020-07-14T10:21:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన నిధులు దుర్వినియోగంపై సీబీఐతో, ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు అవినీతిపై కూడా విచారణ చేయాలని..

నిధుల దుర్వినియోగంపై విచారణ చేయండి

గిరిజన జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేశ్వరరావు డిమాండ్‌


సీతంపేట:కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన నిధులు దుర్వినియోగంపై సీబీఐతో, ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు అవినీతిపై కూడా విచారణ చేయాలని గిరిజన జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు డిమాండ్‌చేశారు.సోమవారం సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయంఎదుట గిరిజన జేఏసీ నిరసన తెలిపింది.ఐటీడీఏలో జరుగుతున్న అక్రమాలపై పోస్టర్లను ఆవిష్క రించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలపై ఐటీడీఏ అధికా రులు వివక్షచూపిస్తున్నారని,అవినీతికి పాల్పడుతున్న అధికారులపై  చర్య తీసుకోవడంలేదని, ఉప విద్యాశాఖాధికారి, పీవో సీసీ  డిప్యుటేషన్లను రద్దుచేయాలని డిమాండ్‌చేశారు.ఈనెల 20న చలోకలెక్టరేట్‌ కార్యక్రమా న్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిమ్మక కాంతారావు, సవర గోపాల్‌, సవర జగన్నాయకులు,కాంతారావు, యోగేశ్వరరావు  పాల్గొన్నారు. 


జీవో-3పై  రివ్యూ పిటీషన్‌ వేయండి

  జీవో- 3ను పునరుద్ధరించేందుకు  సుప్రీంకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటీషన్‌వేయాలని  ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు షేక్‌ షాబ్జి, పి.బాబురెడ్డి కోరారు. సోమవారం  సీతం పేటలోని జిల్లా గిరిజన ఉప సంచాలకుల కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌మండల శాఖ ఆధ్వర్యంలో నిరసనతెలిపారు.ఈ సందర్భంగా  మాట్లాడు తూ జీవో-342 లోని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలు పరిరక్షించాలని కోరారు. అనంతరం పీవో సీహెచ్‌ శ్రీధర్‌కు వినతిపత్రం   అందేజేసారు.   కార్యక్రమంలో ఎ. భాస్కరరావు, కృష్ణారావు   పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T10:21:26+05:30 IST