Abn logo
Sep 24 2021 @ 13:07PM

జగ్గారెడ్డి-రసమయి మధ్య సరదా సంభాషణ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ముగిసిన అనంతరం అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మధ్య సరదా సంభాషణ జరిగింది. రసమయి గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి అన్న వ్యాఖ్యలకు సమాధానంగా.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుందని రసమయి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లను గుర్తించి పాడొచ్చని జర్నలిస్టుల సలహాతో కొత్త పీసీసీపై పాట పాడే స్టేచర్ లేదన్నారు. తన పాట తెలంగాణ అమరవీరులకు, త్యాగాల పునాదులకు అంకింతమని రసమయి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిImage Caption