Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమిత్‌షాతో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ నేతలు!

న్యూఢిల్లీ : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజుల కిందట అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. రేపు (గురువారం) అందుబాటులో ఉండాలని బండి సంజయ్‌కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సహా నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ కానున్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో స్టేట్ గవర్నమెంట్ వైఖరిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది.


Advertisement
Advertisement