ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక పథకం అమలుకు సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2021-08-02T03:01:58+05:30 IST

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక పథకం అమలుకు సీఎం ఆదేశం

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక పథకం అమలుకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 57 ఏళ్లకు పెన్షన్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6 లక్షల 62 వేల మంది కొత్త పెన్షనర్లు పెరగనున్నారు. కుటుంబంలో ఒక్కరికే  పింఛను పద్ధతిని కొనసాగించనున్నారు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేస్తారు. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మంజూరైన 7 మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అయిన కేబినెట్.. పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించింది.

Updated Date - 2021-08-02T03:01:58+05:30 IST