Abn logo
Sep 16 2021 @ 21:08PM

వచ్చే ఏడాది నుంచి మద్యం షాపుల్లో రిజర్వేషన్లు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నుంచి మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు ఆరు గంటలపాటు  కేబినెట్ సమావేశం కొనసాగింది. సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. పలు అంశాలపై సబ్ కమిటీలను తెలంగాణ కేబినెట్ ఏర్పాటు చేసింది. రోడ్ల మరమ్మతులకు మరో రూ.100 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.300 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.


  నారాయణగూడలో బాలికల హాస్టల్‌ నిర్మాణానికి 1,261 గజాల స్థలాన్ని కేటాయించారు. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు వచ్చే ఏడాది నుంచి మద్యం షాపుల్లో రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. 

ఇవి కూడా చదవండిImage Caption