కరోనా నేపథ్యంలో కేసీఆర్ మరో కీలక ప్రకటన చేయబోతున్నారా!?

ABN , First Publish Date - 2020-03-24T20:28:49+05:30 IST

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ అయ్యాయి. మరోవైపు ప్రజా రవాణా మొదలుకుని..

కరోనా నేపథ్యంలో కేసీఆర్ మరో కీలక ప్రకటన చేయబోతున్నారా!?

హైదరాబాద్ : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ అయ్యాయి. మరోవైపు ప్రజా రవాణా మొదలుకుని రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రులు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మరో కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌‌ను ప్రజలు పాటించకుంటే కర్ఫ్యూను అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. ఈ విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఏం ప్రకటించబోతున్నారు..? అనే దానిపై తెలంగాణ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


అత్యున్నత స్థాయి సమావేశం!

ఇప్పటికే.. రెవెన్యూ, హోం శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులను ప్రగతి భవన్‌కు సీఎం పిలిపించుకున్నారు. తెలంగాణలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయ్..? అసలు ప్రజలు సహకరిస్తున్నారా లేదా..?. ఇంకా ఈ ఆంక్షలను ఏ విధంగా కఠినతరం చేయాలి..? అనేదానిపై ఈ సమావేశంలో నిశితంగా చర్చించబోతున్నారు. మరికాసేపట్లో ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. 


కీలక ప్రకటన ఇదేనా!?

కాగా.. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఏమేం చర్చించబోతున్నారు..? సమావేశం అనంతరం ఏం ప్రకటించబోతున్నారు..? సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? అయితే సీఎం ఏం ప్రకటన చేయబోతున్నారనే దానిపై రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. ఈ సమావేశంలో భాగంగా కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. లాక్ డౌన్ కొనసాగింపుపై కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో పూర్తిగా కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని సమాచారం. రోజులో కేవలం ఒకే ఒక్క గంట మాత్రమే ప్రజలు బయటికి వచ్చేందుకు అనుమితిచ్చేలా ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. వ్యాపారుల నిత్యావసర వస్తువుల రేట్లను అడ్డగోలుగా పెంచేయడంతో దీనిపై కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది.


ఎలా పంపిణీ చేయాలి..!?

అంతేకాదు.. లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో యథేచ్చగా తిరుగుతుండటంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఏ విధంగా మరింత కఠినంగా అమలు పరచాలి..? అనేదానిపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, డబ్బు పంపీణిపై కూడా చర్చించి కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. వీటిని ఏవిధంగా పంపిణీ చేయాలి..? అనేదానిపై నిశితంగా చర్చించి కేసీఆర్ ఓ ప్రకటన చేయబోతున్నారని సమాచారం.


కేంద్రం అలా..!?

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కట్టడికి దేశంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పాటిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు తమకేమీ కాదన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం.. తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. లాక్‌డౌన్‌‌ను ప్రజలు పాటించకుంటే కర్ఫ్యూను అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Updated Date - 2020-03-24T20:28:49+05:30 IST