తక్షణమే టెస్ట్, ట్రీట్, ట్రాక్

ABN , First Publish Date - 2020-04-25T06:14:37+05:30 IST

తెలంగాణాలో కోవిడ్- 19 నివారణకు అవిరళ కృషి చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్యరక్షక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు శతాధిక అభినందనలు తెలుపుతూ, తెలంగాణా విద్యావంతుల వేదిక ఈ క్రింది డిమాండ్లను....

తక్షణమే టెస్ట్, ట్రీట్, ట్రాక్

తెలంగాణాలో కోవిడ్- 19 నివారణకు అవిరళ  కృషి చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్యరక్షక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు శతాధిక అభినందనలు తెలుపుతూ, తెలంగాణా విద్యావంతుల వేదిక ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నది.

టెస్ట్, ట్రీట్, ట్రాక్ అన్న మూడంచెల కరోనా వ్యాధి నిరోధక విధానాన్ని సత్వరమే అమలు జరపాలి. టెస్ట్ (test)–పరీక్షలు, ట్రీట్ (treat)–చికిత్స, ట్రాక్ (track)--– వైరస్‌ ఉన్న వారి నుండి ఎవరెవరరికి సంక్రమించిందో వెతకడం.


50ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తికి పరీక్ష నిర్వహించి వ్యాధి సోకిందీ లేనిదీ నిర్ధారించాలి. 


స్వస్థలాలకు వెళ్ళే దారి లేక, ఇక్కడ పనీ ఆదాయం లేక కష్టాల పాలయిన వలస కార్మికులకు ఆహారం, వసతి ఏర్పాటు చేసి ఆర్థికంగా వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం ప్రకటిస్తున్న రేషన్ పంపిణీ, డబ్బు రూపేణా మద్దతు పథకాలు అన్నార్తులలో సగంమందికికూడా అందుబాటులో లేవని గుర్తెరిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.


అన్ని హంగులు కలిగిన ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులను, మిలిటరీ దవఖానాలను ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకొని కోవిడ్ -19 వ్యాధి సోకిన వాళ్ళ సౌకర్యార్థం ప్రభుత్వ నిర్వహణలో వారికి చికిత్స అందించాలి.


ప్రభుత్యోగులకు, పెన్షనర్లకు వేతనాలలో, పెన్షన్లలో కోత విధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం స్థిరీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. పైన పేర్కొన్న అంశాలపట్ల ప్రభుత్వం వైపు నుండి సానుకూల స్పందన ఆశిస్తున్నాము.


– అంబటి నాగయ్య, రాజేంద్ర బాబు అర్విణి, 

సాజి గోపాల్, బి ఎస్ ఆర్ క్రిష్ణ, సైదులు 

(తెలంగాణా విద్యావంతుల వేదిక)

Updated Date - 2020-04-25T06:14:37+05:30 IST