సింగపూర్ టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-14T02:23:04+05:30 IST

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 13న సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ఘనంగా నిర్వహించారు. జూమ్ మీట్‌లో జరిగిన ఈ వేడుకల్లో..

సింగపూర్ టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

సింగపూర్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 13న సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ఘనంగా నిర్వహించారు. జూమ్ మీట్‌లో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మన పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు వాటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంబరాలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబురాలను ఆన్‌లైన్‌లో వందలాది మంది వీక్షించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జూలూరి సంతోష్ కుమార్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, నంగునూరి సౌజన్య, శివ ఆవుల వ్యవరించారు. 


కాగా.. సంబరాల్లో పాల్గొన్న వారందరికీ సొసైటీ సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్‌లు ధన్యవాదాలు తెలిపారు. సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన దాతలు విజయ మోహన్ వెంగళ, నవీన్ కుమార్ గౌరిశెట్టి, డార్విన్ బైస, చామిరాజ్ వెంకట రామాంజనేయులు, స్పాన్సర్స్ మై హోమ్, హెచ్‌డీఎఫ్‌సీ, బాలాజీ వేఫర్స్, గులాఫ్రుతో పాటు పూజ అలంకరరణ, సామాగ్రి సమకూర్చిన మంచికంటి స్వప్న శ్రీధర్లకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



Updated Date - 2021-04-14T02:23:04+05:30 IST