సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2021-01-17T13:33:32+05:30 IST

సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు.

సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. వర్చువల్‌ విధానంలో నిర్వహించిన వేడుకలో వేలాది మంది పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సభ్యులు పండగ ప్రాముఖ్యతను నేటి తరానికి వివరించారు. గాలిపటాలు, గొబ్బెమ్మల తయారీతోపాటు చిత్రలేఖనం, పాటలు, నృత్య పోటీలను వర్చువల్‌ విధానంలో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పండగ సంబరాలకు చేయూత అందించిన వారికి తెలంగాణ కల్చరల్‌ సొసైటీ (సింగపూర్‌) అధ్యక్షుడు మహేందర్‌, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-01-17T13:33:32+05:30 IST