కే‌ఆర్‌ఎం‌బీ చైర్మన్‌కు తెలంగాణ ఈ‌ఎన్‌సీ లేఖ

ABN , First Publish Date - 2021-09-30T00:38:48+05:30 IST

కే‌ఆర్‌ఎం‌బీ చైర్మన్‌కు తెలంగాణ ఈ‌ఎన్‌సీ లేఖ రాసింది. సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని ఈ‌ఎన్‌సీ కోరింది.

కే‌ఆర్‌ఎం‌బీ చైర్మన్‌కు తెలంగాణ ఈ‌ఎన్‌సీ లేఖ

హైదరాబాద్‌: కే‌ఆర్‌ఎం‌బీ చైర్మన్‌కు తెలంగాణ ఈ‌ఎన్‌సీ లేఖ రాసింది. సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని ఈ‌ఎన్‌సీ కోరింది. 1952లో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. సాగర్ కుడి కాల్వ(ఆంధ్రప్రదేశ్ వైపు), ఎడమ కాల్వ(తెలంగాణ వైపు).. హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని ఈ‌ఎన్‌సీ పేర్కొంది. ఎండీడీఎల్‌ 510 అడుగుల దగ్గర ఎడమకాల్వ విడుదల సామర్థ్యం.. 7,899 క్యూసెక్కులు ఉండగా కుడి కాల్వ విడుదల సామర్థ్యం 24,606 క్యూసెక్కులు ఉందని, ఇది 2 కాల్వల్లో ఉన్న తీవ్రమైన అసమానత అని ఈఎన్‌సీ తెలిపింది. 2 కాల్వల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో అసమానతను సరిచేయాలని ఈ‌ఎన్‌సీ కోరింది.

Updated Date - 2021-09-30T00:38:48+05:30 IST