Abn logo
Jan 19 2021 @ 07:24AM

అమెరికాలో తెలుగు టెకీ మృతి!

హుజూరాబాద్‌, జనవరి 18: తెలంగాణకు చెందిన యువ ఇంజనీర్‌ అనారోగ్యంతో అమెరికాలో చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన పంబిడి నిఖిల్‌రావు (29) ఐదేళ్ల క్రితం ఎంఎస్‌ కోసం అమెరికాకు వెళ్లారు. చదువు అయిపోయాక అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నిఖిల్‌రావుకు జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన మృతి చెందారు. ఈ మేరకు నిఖిల్‌రావు స్నేహితులు హుజూరాబాద్‌లోని ఆయన తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement