ప్రైవేట్‌ టీచర్లకు ఆర్థిక సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-04-09T01:14:37+05:30 IST

ప్రైవేట్‌ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 2 వేలతో పాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ప్రైవేట్‌ టీచర్లకు ఆర్థిక సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ప్రైవేట్‌ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పాఠశాలలు తిరిగి తెరిచే వరకు ఈ నెల నుంచి 2 వేలతో పాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందికి వర్తిస్తాయి. రేషన్‌ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం సరఫరా చేయనున్నారు. టీచర్లు, సిబ్బంది బ్యాంక్‌ అకౌంట్ వివరాలను కలెక్టర్లకు ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు. విధివిధానాలు ఖరారు చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శికి కేసీఆర్‌ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షా 45 వేల మంది ప్రైవేట్‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది లబ్ధి పొందుతారు. విద్యాసంస్థల మూసివేతతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్‌ చెప్పారు.

Updated Date - 2021-04-09T01:14:37+05:30 IST