టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు

ABN , First Publish Date - 2020-06-03T23:18:41+05:30 IST

టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు

హైదరాబాద్: టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని  విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కట్టడి ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. పరీక్షల నిర్వహణపై సమీక్ష చేసి రిపోర్ట్ ఇవ్వాలని గతంలోనే కోర్టు ఆదేశించింది.


తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 8 నుంచి జులై 5 వరకూ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న మ్యాథ్స్ పేపర్-1, 17న మ్యాథ్స్ పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేశారు. 

Updated Date - 2020-06-03T23:18:41+05:30 IST