ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తే అంతే.. రాష్ట్రంలో కొత్త రూల్

ABN , First Publish Date - 2020-04-09T23:54:54+05:30 IST

కరోనాను ఎదుర్కొనేందుకు, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్ పాస్ చేసింది. రోడ్లపైన, సామాజిక ప్రాంతాల్లో...

ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తే అంతే.. రాష్ట్రంలో కొత్త రూల్

హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్ పాస్ చేసింది.  రోడ్లపైన, సామాజిక ప్రాంతాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతి కుమారి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యక్తిగతంగానే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కలిగి ఉండాలని, అందుకే ఈ నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం బుధవారం ఈ జీవో విడుదల చేసిందని, దీని ప్రకారం పాన్, చూయింగ్ గమ్, పొగాకు ఉత్పత్తులు వంటివి ఏవైనా ఎక్కడ పడితే అక్కడ ఎవరూ ఉమ్మివేయకూడదని ఆమె హెచ్చరించారు. ఇలా ఉమ్మివేయడం వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. 


ఇదిలా ఉంటే ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లైతే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించలేదని, అయితే ప్రజలందరూ సామాజిక బాధ్యతగా దీనిని పాటిస్తే కరోనాపై చేస్తున్న పోరాటానికి కొంత మద్దతుగా ఉంటుందని వైద్య విద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ కే రమేశ్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-04-09T23:54:54+05:30 IST