లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించండి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-05-17T18:19:03+05:30 IST

కరోనా పరిస్థితులపై హైకోర్టుల విచారణ కొనసాగుతోంది.

లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించండి: హైకోర్టు

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై హైకోర్టుల విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కార్పొరేషన్‌లు ఎన్‌జీఓలతో ఒప్పందం చేసుకుని కమ్యునిటి కిచన్‌లు  ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతిజిల్లా వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ కిచన్ వివరాలు పొందుపరచాలని న్యాయస్థానం సూచించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీనియర్ సిటిజన్‌లు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్‌జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని తెలిపింది. కాగా ఎలక్షన్ డ్యూటీలో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారని... 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఎలక్షన్ డ్యూటీలో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని పేర్కొంది. వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-05-17T18:19:03+05:30 IST