Abn logo
Sep 22 2021 @ 23:25PM

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

మంచిర్యాలలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

-పసలేని ప్రతిపక్షాల వాదనలను ప్రజలు నమ్మవద్దు

-రాష్ట్రంలో కులవృత్తులకు పెద్దపీట

-రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

ఏసీసీ,సెప్టెంబరు 22: తెలంగాణా రాష్ట్రసాధన ఉద్యమంలో నాడు పోరాటం చేశామనీ, నేడు అభివృద్ధి పథంలో దేశానికే అదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్రఎక్సైజ్‌, క్రీడలశాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్‌ లో ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  ఆయన మంత్రి ఎంపీబోర్లకుంట వెంకటేష్‌ నేత,ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ,జిల్లా కలెక్టర్‌ భారతిహోళ్లీకేరీ, ఎమ్మెల్యేదివాకర్‌ రావులతో కలిసి రిబ్బన్‌ కట్‌ చేసి  ప్రారంభించారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడారు. ఈప్రాంతమంటే  ముఖ్యమత్రికి మక్కువ అన్నారు. నీళ్లుకు, ప్రకృతి సోయగాలతో  సహజ వనరులున్న జిల్లాగా తమతో ఎపుడూ చెబుతారన్నారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగాన్ని నిధులు కేటాయించి అభివృద్దికి కృషిచేస్తానన్నారు. జిల్లాలో అక్రమమద్యం, నిషేధిత గుడుంబా, నాటు సారా తయారీ పై ప్రత్యేక దృష్టి సారించి నియంత్రించేందుకు కృషిచేయాలన్నారు. మద్యం షాపుల టెండర్లలో దళిత ,గిరిజన గీతకార్మికులకు రిజర్వేషన్‌ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణా అని అన్నారు. కులవృత్తులపై జీవించే వారికి ఎల్లవేళలా  తోడ్పాటు అందిస్తామన్నారు. లైసెన్స్‌లలో 1/70 యాక్ట్‌ ప్రకారం అధ్యయనం చేసి అర్హులకు అందజేయాలన్నారు.  రాష్ట్రంలో కుల సంఘాలకు 300కోట్ల విలువైన భూములు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌ , సీఐ నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ పల్లె భూమేష్‌ , పీఏసీఎస్‌ చైర్మెన్‌ సందెల వెంకటేష్‌ , టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం తదితరులు పాల్గొన్నారున

పేదవర్గాల అభ్యన్నతే కేసీఆర్‌ ధ్యేయం 

లక్షెట్టిపేట: పేదవర్గాల అభ్యన్నతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం రాత్రి లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మిం చిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్జ్సైజ్‌ శాఖ భవనాన్ని ఆయన ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోని పలువురు సంఘ సంస్కర్తలు, మేధావులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో ఆలోచనలు చేశారని అన్నారు. కాగా వాటిని ఆచరణలో చూపి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు.  బడుగు, బలహీన వర్గాల్లో గౌడ కులానికి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. తండ్రి మరణించినా తనయుడు చెట్లు ఎక్కి కల్లు గీస్తాడని చెప్పారు. వారసత్వంగా వస్తున్న మా కులవృత్తిని పవిత్రంగా భావిస్తూ కల్లును తీసి అమ్ముకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత పాలకులు గౌడ కుల వృత్తిని అణగదొక్కారని అన్నారు. హైదరాబాద్‌లో కల్లు అమ్ముకోవడమే నేర మన్నట్లు పాలన సాగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానంతో అన్ని పట్టణాల్లో సురాపానం కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మద్యం షాపుల్లో గౌడ కులవృత్తులకు 15 శాతం కేటాయించడంపై ముఖ్యమంత్రికి గౌడ సంఘం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా గౌడ కులానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న లైసెన్స్‌లు 24 గంటల్లోగా జారీ చేయాలని స్టేజీ మీద ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. మధ్యలో ఆగిపోయిన స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గోదావరి నదిలో బోటింగ్‌ ఏర్పాటు చేయడానికి తమశాఖ నుంచి కావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. వాటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌ తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ముఖ్య మంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్షీరాభిషేకం చేశారు.  కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంఎల్‌సీ పురాణం సతీష్‌, జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ, డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌రేకాంత్‌, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు రాజయ్య, బాలరాజుగౌడ్‌, జాతీయ అధ్యక్షులు నర్సగౌడ్‌, లక్షెట్టిపేట మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పోడేటి శ్రీనివాస్‌గౌడ్‌, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది , ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతి నిధులు , టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.