Abn logo
Sep 24 2021 @ 16:07PM

తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది: కేసీఆర్

హైదరాబాద్: నూతన రాష్ట్రంగా తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీఏసీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ నియమాల ప్రకారం  అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న సబ్జెక్టులను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు.


ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమలు, హరితహారం, వ్యవసాయంతో పాటు పాతబస్తీ అభివృద్ధితో పాటు కాంగ్రెస్ సూచించిన అంశాలను కూడా సభలో చర్చించాలని చెప్పారు. ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, వాయిదా తీర్మానాలు వంటి సభా సంప్రదాయలను విధిగా పాటిస్తూ అసెంబ్లీని నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. బిల్లులను సభ్యులకు ముందస్తుగానే పంపించాలని, అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యులకు ప్రతిరోజూ లంచ్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండిImage Caption