ప్రజాభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

ABN , First Publish Date - 2022-01-21T06:43:31+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా అభివృద్ధి, సంక్షేమంలో విజ యం సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ప్రజాభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
కుమ్మరికుంటలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

జూలపల్లి, జనవరి 20 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా అభివృద్ధి, సంక్షేమంలో విజ యం సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, ఎంఎల్‌సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్‌ విగ్రహం, ఎల్‌ఎమ్‌ ట్రస్టు ద్వారా చేపట్టిన కమాన్‌, ప్రభుత్వ నిదులు రూ.7కోట్లతో చేపట్టిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, హైలెవల్‌బ్రిడ్జి, మున్నూరు కాపు, యాదవ కమ్యునిటీ భవనాలు, గ్రామ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు, కుమ్మరికుంట నుంచి వనపర్తి గ్రామం వరకు రోడ్డు నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరు ఐకమత్యంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. గతంలోని ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్న ఘనత తమ ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సాగునీటి రంగానికి పెద్ద పీట వేసి ప్రాజెక్టులను పూర్తిచేసి కోటి 30లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధికి రైతుబం ధు, రైతుబీమా, పథకాలను అందించామని, అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. హరితహా రంతో గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చని వాతావరణం కల్పిం చామన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు అన్నిప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌక ర్యాలను మెరుగుపరిచామని, తెలంగాణలో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేసి ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్యసేవలు అం దించేలా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంతేకాకుండా జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం అన్ని విధాలుగా కృషిచేస్తోందన్నారు. రాబో యే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించి విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం విద్యను బోధించేలా తమ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. అనంతరం కొప్పుల చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షులు కొప్పుల స్నేహలత ఆధ్వర్యంలో గ్రామంలోని బంధుమిత్రలు, పేద లకు చీరెలు, దోవతులు, దుస్తులను అందజే శారు. ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా మంజూరు అయిన కుట్టు మిషన్లను మహిళలకు అందజే శారు. కొప్పుల ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్‌ పోటీల్లో విజయం సాధించిన జట్లకు నగదుతో పాటు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మేచినేని సంతోష్‌రావు, ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం, ఎంపీపీ కూసు కుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మీనర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, మార్కెట్‌ చైర్మన్‌ కంది చొక్కారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌లు కొంజర్ల వెంకటయ్య, పుల్లూరి వేణుగోపాల్‌రావు, గోపు విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేష్‌లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎం పీటీసీలు ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:43:31+05:30 IST